నిన్నటివరకు లివ్ ఇన్ టుగెథెర్,ఏడు పదుల వయసులో పెళ్లి  

73 Years Old Groom,67 Years Old Bride Got Married After 50 Years Of Living Relation - Telugu 67 Years Old Bride Got Married After 50 Years Of Living Relation, 73 Years Old Groom, Bride, Gauthar Hin Bhai, In Together, Love Affair\\'s, Marriage, Shukhal Nishadh

ఈ కాలంలో లివ్ ఇన్ టుగెథెర్ గురించి చాలానే వింటూ ఉన్నాం.అయితే పాత కాలం కి చెందిన వారు కూడా లివ్ ఇన్ టుగెథెర్ పద్దతిని పాటించారు అన్న విషయం తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు.

73 Years Old Groom,67 Years Old Bride Got Married After 50 Years Of Living Relation - Telugu 67 Years Old Bride Got Married After 50 Years Of Living Relation, 73 Years Old Groom, Bride, Gauthar Hin Bhai, In Together, Love Affair\\'s, Marriage, Shukhal Nishadh-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అందులోనూ ఒక చిన్న గ్రామంలో ఇలాంటి రిలేషన్ షిప్ 50 ఏళ్ల పాటు కొనసాగించారు అంటే అర్ధం చేసుకోవాలి.ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ లోని కబీర్ ధామ్ జిల్లా లోని ఖైర్జిటీ కాలా గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే… ఆ గ్రామానికి చెందిన శుకల్ నిషాద్(73),గౌతర్ హిన్ బాయి (67) లు గత 50 ఏళ్లుగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు.వాస్తవానికి పెళ్లి వయసు వచ్చిన తరువాత శుకల్ పెళ్లి చూపుల కోసం అని బిర్సింగి గ్రామానికి వెళ్ళాడు.

అయితే అక్కడ చూడాల్సిన అమ్మాయి కాకుండా ఆమె చెల్లెలి పై శుకల్ మనసుపడ్డాడు.అయితే ఆ తరువాత ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది.

దీనితో వివాహం లేకుండానే వారిద్దరూ 50 ఏళ్లు గా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో కలిసి ఉన్నారు.అయితే ఈ క్రమంలోనే వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కూడా కలిగారు.

వారందరికీ కూడా పెళ్లిళ్లు చేసినప్పటికీ వీరుమాత్రం ఇలానే లివ్ ఇన్ లోనే ఉండిపోయారు.ఇప్పుడు వారికి ఎనిమిది మంది మనుమ సంతానం కూడా కలిగారు.

అయితే ఇప్పుడు తమ పిల్లలు పెళ్లి చేసుకోవాలి అంటూ సూచించడం తో చివరికి ఇప్పుడు ఈ ఏడుపదుల వయస్సు లో పెళ్లి పీటలు ఎక్కారు.వారి పిల్లలు,మనవ సంతానం సమక్షంలోనే శుకల్ నిషాద్, గౌతర్ హీన్ బాయి లు వివాహబంధం తో ఒక్కటయ్యారు.

నిజంగా వీరి ప్రేమ,పెళ్లి గురించి వింటుంటే మాత్రం ప్రేమకు వయసుతో సంబంధం లేదు అన్న విషయం గుర్తుకురాకమానదు.పాత కాలం వారు కాబట్టే 50 ఏళ్లు లివ్ ఇన్ లో ఉన్నప్పటికీ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.అదే ఈ జనరేషన్ లో అయితే కొంచం ఇలాంటి పెళ్లిళ్లు చూడడం కష్టం అనే చెప్పాలి.

తాజా వార్తలు

73 Years Old Groom,67 Years Old Bride Got Married After 50 Years Of Living Relation-73 Years Old Groom,bride,gauthar Hin Bhai, In Together,love Affair\\'s,marriage,shukhal Nishadh Related....