వైరల్‌ : ఈ బామ్మను చూసిన తర్వాత మిమ్ములను మీరు తిట్టుకోవడం కన్ఫర్మ్‌

ప్రతి ఒక్కరికి యోగా చేయాలని.జిమ్‌ చేయాలనే కోరిక ఉంటుంది.

 72 Year Old Lady Lauren Bruzzone Workout-TeluguStop.com

ఎక్కువ మంది బద్దకం వల్ల చేయరు, కొందరు టైం లేక చేయరు.ఏది ఏమైనా ప్రతి రోజు వర్కౌట్స్‌ చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు.

కాని రెగ్యులర్‌గా జిమ్‌ చేసే వారికి మంచి ఆరోగ్య బెనిఫిట్స్‌ ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Telugu Ladylauren, Anandmahendra, Anandhmahendra, Lady, Telugu General-

ఇప్పటికే రెగ్యులర్‌గా జిమ్‌ చేసిన వారి గురించి తెలుసుకున్నాం.ఇప్పుడు మరో కొత్త వ్యక్తిని ఇప్పుడు మీ ముందుకు తీసుకు వచ్చేశాము.ఈమె వీడియోను ఆనంద్‌ మహీంద్ర ట్వీట్‌ చేయడం వల్ల ప్రస్తుతం ఈమె వైరల్‌ అవుతోంది.

Telugu Ladylauren, Anandmahendra, Anandhmahendra, Lady, Telugu General-

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ఆనంద్‌ మహీంద్ర ఈసారి 72 ఏళ్ల అమెరికన్‌ ఐరెన్‌ లేడీ లారెన్‌ బ్రజోన్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు.పాతిక ఏళ్ల కుర్రాళ్లు కూడా చేసేందుకు కష్టమయ్యే జిమ్‌ వర్కౌట్స్‌ ను ఆమె చాలా సింపుల్‌గా చేస్తుంది.ఆమె జిమ్‌ వర్కౌట్స్‌ చూస్తుంటే అసలు మనుషులు ఇలా కూడా చేస్తారా అనిపిస్తుంది.అలాంటిది ఏకంగా ఏడు పదుల వయసు మహిళ ఇంతగా చేయడం ఏంటీ అంటూ అంతా ఆశ్చర్య పోతున్నారు.

Telugu Ladylauren, Anandmahendra, Anandhmahendra, Lady, Telugu General-

లారెన్‌ బ్రజోన్‌ వర్కౌట్స్‌ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.ఆమె గురించి ఆనంద్‌ మహింద్ర మాట్లాడుతూ.ఈ వీడియోను చూస్తుంటే నేను మరింత ఎక్కువ సమయం వర్కౌట్స్‌ చేయాలని అనిపిస్తుంది.ఆమె ఐరెన్‌ లేడీ.ఆమెకు ధీటుగా మరెవ్వరు ఉండరేమో అనిపిస్తుంది.ఆమెను చూస్తుంటే తనను తాను మార్చుకోవాలనుకుంటున్నాను.

ఇకపై జిమ్‌ చేయకుండా ఉండేందుకు సాకులు వెదుకొద్దని నిర్ణయించుకున్నాను అంటూ ఈ సందర్బంగా ఆనంద్‌ మహీంద్ర అంటున్నాడు.ఆమెను చూస్తుంటే మీపై మీకు కోపంగా ఉంది కదా.నేను ఎందుకు ఆమెలా జిమ్‌ చేయలేక పోతున్నాను అని మిమ్మల్ని మీరు తిట్టుకుంటారు ఈ వీడియోను చూస్తే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube