నీళ్ల కోసం ఇళ్లు పోయాయి

నీళ్ల కోసం పేదలు తమ ఇళ్లను పోగొట్టుకున్నారు.పోగొట్టుకున్నారు అనడం కంటే సర్కారు బలవంతంగా పోగొట్టింది అనడం కరెక్టు.అవును…పోలవరం ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పేదల, సామాన్యుల ఇళ్లను కూల్చేసింది.తూర్పు గోదావరి జిలాలలోని అంగలూరు గ్రామంలో డెబ్బయ్‌ ఒక్క ఇళ్లను ప్రభుత్వం మంగళవారం బలవంతంగా కూల్చిపారేసింది.

 Houses Demolished For Polavaram Canal-TeluguStop.com

ప్రజల నిరసనలును ఏమాత్రం పట్టించుకోకుండా పోలీసు బలగాలను ఉపయోగించి ఇళ్లను నేలమట్టం చేయించింది.ప్రజలు మొత్తుకున్నా, ఏడ్చినా, అధికారులతో వాదనలకు దిగినా ఏం ప్రయోజనం లేదు.

అంగలూరు గ్రామం పోలవరం ప్రభావిత ప్రాంతం కిందకు వస్తుంది.రెండువేల ఎనిమిదో సంవత్సరంలో అప్పటి కాంగ్రెసు ప్రభుత్వం ఒక్కో ఇంటికి లక్షా యాభైఅయిదు వేలు ఇచ్చింది.

పంట భూములకు ఎకరానికి లక్షా పది వేలు ఇచ్చింది.కాని ఈ పరిహారం చాలా తక్కువ అని ప్రజలు ఆవేదన చెందుతున్నారు.

తమకు న్యాయమైన పరిహారం ఇచ్చేంతవరకు తాము ఇళ్లు నుంచి పోయేది లేదని అప్పటి నుంచి కదలకుండా ఉన్నారు.ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఆ ఇళ్లను కూలగొట్టించింది.

మొత్తం మీద ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి.మరి ప్రభుత్వం వారికి న్యాయం చేస్తుందా?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube