యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘ఆదిపురుష్( Adipurush )’ రేపు ప్రపంచవ్యాప్యంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే.ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ట్రెండ్ ట్రేడ్ పండితులను సైతం నోరెళ్లబెట్టేలా చేస్తుంది.
ముఖ్యంగా 3D వెర్షన్ కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ కి మైండ్ బ్లోయింగ్ రెస్పాన్స్ వస్తుంది.హైదరాబాద్ లో అయితే ప్రభాస్ ( Prabhas ) ఫ్యాన్స్ తాకిడికి బుక్ మై షో యాప్ కూడా కాసేపటి వరకు క్రాష్ అయ్యింది.
ఒకప్పుడు టీజర్ ని చూసి ఇండియా వైడ్ విపరీతమైన ట్రోల్స్ రప్పించుకున్న ఈ సినిమాకి ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఎవరైనా ఊహించారా?, ప్రభాస్ ఊర మాస్ స్టార్ డం కి ఇదే నిదర్శనం అని అంటున్నారు ట్రేడ్ పండితులు.కేవలం మొదటి రోజే ఈ చిత్రం 130 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు సాదిస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా మొదటి రోజు ఇండియా లో 20 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయని అంటున్నారు.ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తెలుగు , హిందీ , తమిళం , కన్నడ మరియు మలయాళం భాషలకు కలిపి 7000 కి పైగా థియేటర్స్ లో విడుదల చేస్తున్నారట.మిగతా భాషల్లో భారీ రిలీజ్ అయితే ఇచ్చారు కానీ, రెండు తెలుగు రాష్ట్రాల్లో మాత్రం #RRR మూవీ రేంజ్ లో థియేటర్స్ ఇవ్వలేదు.కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాకి ఇచ్చినన్ని థియేటర్స్ కూడా ఇవ్వలేదని అభిమానులు ఆరోపిస్తున్నారు.’సర్కారు వారు పాట’ సినిమాకి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 1200 థియేటర్స్ ఇచ్చారు.కానీ ‘ఆదిపురుష్’ కి 1100 థియేటర్స్ మాత్రమే దక్కాయని అంటున్నారు.
కానీ ఇంకా థియేటర్స్ యాడ్ అవుతాయని.అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అంటున్నారు బయ్యర్స్.
ఇక హిందీ లో ఈ చిత్రానికి 20 నుండి 30 కోట్ల రూపాయిల రేంజ్ లో నెట్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.‘పఠాన్‘ చిత్రం తర్వాత బాలీవుడ్ లో విడుదలైన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాయి.కనీస స్థాయి వసూళ్లు కూడా రాబట్టలేక ట్రేడ్ డ్రై అయిపోయింది.ఇప్పుడు ఆదిపురుష్ చిత్రం తో డ్రై అయిపోయిన బాలీవుడ్ ( Bollywood )మార్కెట్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవ్వబోతుంది.
జై శ్రీ రామ్ అనే పదానికి పులకరించిపోయే నార్త్ ఇండియన్స్, ఈ సినిమాకి ఏ రేంజ్ వసూళ్లు ఇస్తారో చూడాలి.తెలుగు , హిందీ అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే ఉన్నాయి కానీ, తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో మాత్రం అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉన్నాయి.
రీసెంట్ గానే వాళ్ళ సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ ఎంతలా బ్రహ్మరథం పెట్టారో అందరికీ తెలిసిందే, కానీ మన సినిమాలకు మాత్రం టికెట్స్ కొనుగోలు చెయ్యడానికి ఇంత వివక్ష ఎందుకు చూపిస్తున్నారో అర్థం కావడం లేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.