సొంత ఊరి కోసం 30 ఏళ్లు శ్రమించి 3 కి.మీ. పొడవైన కాలువ తవ్విన కలియుగ భగీరథుడు...!

కలియుగ భగీరథుడు తన ఊరి కోసం ఏకంగా మూడు కిలోమీటర్ల దూరం లో ఉన్న కొండల నుంచి వచ్చే వర్షం నీరుని ఊరికి తరలించడానికి ఆయన 30 సంవత్సరాలుగా ఏకంగా మూడు కిలోమీటర్ల వరకు కాలువను తవ్వాడు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు లోకి వెళితే… బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లా లహ్తువా ప్రాంతంలో కోథిల్వా గ్రామానికి చెందిన లౌంగీ భుయాన్ అనే వ్యక్తి వారి ఊరి దగ్గరగా ఉన్న కొండలపై కురిసిన వర్షం నీరు వృధా చేయకుండా గ్రామంలోని చెరువుకి తరలించేలా ఆయన గత 30 సంవత్సరాలుగా ఏకంగా ఒక్కడే కష్టపడి ఏకంగా మూడు కిలోమీటర్ల పొడవున కాలువను తవ్వాడు.

 Bihar Old Man Digs Three Kms Canal From 30years, Bihar, Canal, Oldman Digs Canal-TeluguStop.com

ఇందుకు గాను ఆయనకు ఎవరూ ఎటువంటి సహాయం అందించలేదని భుయాన్ వాపోతున్నాడు.

గత ముప్పై సంవత్సరాలుగా తను పశువులను పోషించడానికి సమీపంలో ఉన్న అడవిలోకి వెళ్ళి వాటికి ఆహారం అందించే వాడిని అదే సమయంలో తాను కాలువను తవ్వడం ప్రారంభించాను అని తెలియజేశారు.

ఇకపోతే గ్రామంలోని చాలా మంది ప్రజలు జీవనోపాధి కోసం నగరాలకు వలస వెళ్తున్నారు అని తాను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలియజేశారు.దట్టమైన అడవుల్లో కొండల మధ్య ఉండే వారి గ్రామం మావోయిస్టుల ఆశ్రమం పొందిన గ్రామంగా గుర్తింపు పొందింది.


ఇకపోతే వర్షాకాలంలో ఆ ప్రాంతంలో పడే నీరు నదిలోకి ప్రవహిస్తుందని… అయితే ఆ కాలువ ద్వారా అడవిలో ఉన్న జంతువులకు ప్రయోజనం కోసం ఇటు ప్రజలకు, వారి పంట పొలాల కోసం ఉపయోగపడేలా తాను ఆలోచన చేసి కాలువను తవ్వాడని గ్రామంలో స్థానికుడు తెలియజేశారు.ఇకపోతే లౌంగీ భుయాన్ సొంత ప్రయోజనం కోసం కాకుండా గ్రామం కోసం చేశాడని తెలియజేశారు.

ఊర్లోని గ్రామస్తులకు, వారి పంట పొలాలకు ఎంతో మేలు చేశాడని ఆ ఊరి లో పనిచేసే ఉపాధ్యాయులు ఆయనను ప్రశంసలతో ముంచెత్తారు.ఆ పెద్దాయన కష్టపడినా ఫలితం ఊరికే పోదని ఆయన గురించి ప్రజలు కచ్చితంగా తెలుసుకుంటారని ఉపాధ్యాయులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube