ఇటీవల కాలంలో జరిగే కొన్ని ఘటనలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.ఎందుకంటే గతంలో జరగనివి అన్ని ఈ కాలంలో జరుగుతున్నాయి కాబట్టి.
ఇకపోతే ఓ వృద్ధ జంటకు ప్రేమకు వయసుతో సంబంధం లేదని.మనసుతో సంబంధం అని నిరూపించింది.70 ఏళ్ల వృద్ధుడు.55 ఏళ్ల వధువు.ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే.ఆ వృద్ధుల ప్రేమకు పిల్లలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పెళ్లి చేసేశారు.
ఆశ్చర్యం వేస్తుంది కదా! ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్‌లోని భూరఖెడీ గ్రామంలో జరిగింది.
భురాఖేడి గ్రామానికి చెందిన ఉమ్రావ్ సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు అనారోగ్యం పాలై స్థానిక ఆస్పత్రిలో చేరాడు.అదే ఆస్పత్రిలో ఉన్న గుడీబాయి అనే 55 మహిళతో పరిచయం ఏర్పడింది.
ఇద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం కాస్త ప్రేమగా మారింది.ఇంకేముంది ఆ వృద్ధుడు పెళ్లి చేసుకుందాం అని ఆ యువతిని అడిగాడు.ఆమె ఓకే చెప్పింది.దీంతో ఆమెను అతని గ్రామానికి తీసుకెళ్లగా ఆమెను పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పాడు.
అది విన్న వారు ఆశ్చర్యానికి గురయ్యి మీరు పెళ్లి చేసుకోండి అని సంతోషంగా ఒప్పుకున్నారు.వారే దగ్గరుండి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు.ఇక వారి పెళ్ళికి బంధువులను ఆహ్వానించి భోజనాలు పెట్టి మరి పెళ్లి చేశారు.ప్రస్తుతం దీనికి సంబంధించిన ఘటన నెట్టింట్లో వైరల్ గా మారింది.