ఆ దేశంలో70 ఏనుగులను చంపేస్తున్నారు... ఎందుకంటే..?

కొన్ని రోజుల క్రితం ఆస్ట్రేలియా ప్రభుత్వం 5000 ఒంటెలను చంపాలని తీసుకున్న నిర్ణయంపై ప్రపంచవ్యాప్తంగా జంతు ప్రేమికుల నుండి తీవ్రమైన విమర్శలు వ్యక్తమైన విషయం తెలిసిందే.తాజాగా ఆస్ట్రేలియా తీసుకున్న విధంగానే దక్షిణాఫ్రికాలోని బోట్వాన్సా ప్రభుత్వం 70 ఏనుగులను చంపాలని తీసుకున్న నిర్ణయం గురించి తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

 70 Elephants Killed In Australia-TeluguStop.com

రోజురోజుకు ఒంటెలు, ఏనుగుల జాతులు అంతరించిపోతున్నాయని వాటి సంఖ్య తగ్గుముఖం పడుతోందని తాము భావిస్తోంటే ప్రభుత్వాలు ఒంటెలను, ఏనుగులను చంపేలా నిర్ణయం తీసుకోవటం ప్రభుత్వాల చేతకాని పాలనకు నిదర్శనం అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

బోట్వాన్సా ప్రభుత్వం తాజాగా ఏనుగుల వేటపై నిషేధం ఎత్తివేయటంతో పాటు అధికారికంగా ఏనుగులను చంపటం కోసం నిర్ణయం తీసుకుంది.

ఏనుగుల జనాభా రోజురోజుకు పెరుగుతోందని వేటగాళ్లు ఏనుగులను చంపుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.ప్రభుత్వం ఏనుగుల వేటపై నిషేధం ఎత్తివేయటంతో పాటు 70 ఏనుగులను చంపాలని నిర్ణయం తీసుకోవటంపై రాజకీయ పార్టీలు, ప్రజలు, జంతు ప్రేమికుల నుండి ఆగ్రహం వ్యక్తమవుతోంది.

బోట్వాన్సా ప్రభుత్వం మాత్రం ఏనుగుల జనాభా పెరుగుతూ ఉండటం వలన మనుషుల మనుగడకే కష్టమవుతోందని అందువలనే ఏనుగుల వేటపై నిషేధం ఎత్తివేశామని చెబుతోంది.ఏనుగులను చంపాలని నిర్ణయం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉందని ఏనుగుల వలన రైతులు పండించిన పంటలు నాశనం కావడంతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని వేటకు అనుమతి ఇవ్వడమే ఈ సమస్యకు పరిష్కారమని ప్రభుత్వం చెబుతోంది.

ప్రభుత్వం రిజిష్టర్ చేసుకున్న వేటగాళ్లు మాత్రమే 70 ఏనుగులను చంపాలని అనుమతి ఇచ్చింది.ప్రభుత్వం నిబంధనల ప్రకారం వేటగాళ్లు వారికి అనుమతిచ్చిన ప్రాంతాలలో ఏనుగులను మట్టుబెట్టాల్సి ఉంటుంది.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube