దారుణం : మద్యం మత్తులో కన్న కూతురి పై కీచక తండ్రి …  

7 years old girl raped, Rajasthan, Crime news, child harassment - Telugu 7 Years Old Girl Raped, Child Harassment, Crime News, Rajasthan

సమాజంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలను చూస్తుంటే ఇంతటి క్రూరమైన ప్రపంచంలో జీవిస్తున్నామనే సందేహం కచ్చితంగా కలుగుతుంది.తాజాగా ఓ వ్యక్తి  పీకల దాకా మద్యం సేవించి అభం శుభం తెలియని తన ఏడేళ్ల కూతురిపై దారుణంగా అత్యాచారం చేసిన ఘటన దేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

 7 Years Old Girl Raped By His Father In Rajasthan

వివరాల్లోకి వెళితే స్థానిక రాష్ట్రానికి చెందిన ఉదయపూర్ అనే ప్రాంతంలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులతో నివాసముంటున్నాడు.అయితే ఈ వ్యక్తి కుటుంబ పోషణ నిమిత్తమై స్థానికంగా  ఉన్నటువంటి ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్ గా పని చేసేవాడు.

  ఈ క్రమంలో వ్యక్తి అప్పుడప్పుడు మద్యం సేవించి ఇంటికి వచ్చి నానా హంగామా చేస్తుండేవాడు.దీంతో విసుగు చెందిన ఇతడి భార్య తన 7 ఏళ్ల కూతురు ని తీసుకొని తన తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది.

దారుణం : మద్యం మత్తులో కన్న కూతురి పై కీచక తండ్రి …-Latest News-Telugu Tollywood Photo Image

దీంతో తన భార్యను చూసేందుకు వెళ్లినటువంటి వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి తన కన్న కూతురని కూడా చూడకుండా అభం శుభం తెలియని చిన్నారిపై దారుణంగా అత్యాచారం చేశాడు.

అనంతరం చిన్నారిని రోడ్డుపై వదిలి పెట్టి వెళ్లిపోయాడు.

రక్తపు మడుగులో చిన్నారి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించి చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.వైద్య చికిత్సలు నిర్వహించిన అనంతరం వైద్యులు చిన్నారిపై పై అత్యాచారం జరిగిందని చెప్పడంతో ఒక్కసారిగా కుటుంబ సభ్యులు ఖంగు తిన్నారు.

అంతేగాక బాధితురాలిని వెంటబెట్టుకుని దగ్గరలో ఉన్నటువంటి పోలీసులను సంప్రదించి కీచక తండ్రి పై ఫిర్యాదు చేసి కటకటాల్లోకి నెట్టాలని కోరారు.

#Rajasthan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

7 Years Old Girl Raped By His Father In Rajasthan Related Telugu News,Photos/Pics,Images..