యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకధీరుడు రాజమౌళి కాంబో వచ్చిన విజువల్ వండర్ బాహుబలి గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే.తెలుగు సినిమాను ప్రపంచస్థాయిలో నిలబెట్టిన సినిమాగా ఇది చరిత్ర క్రియేట్ చేసింది.
సాధారణ కథను అసాధారమైన పనితీరుతో ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిపెట్టాడు జక్కన్న.భారీ తారాగాణం, భారీ బడ్జెట్, భారీ గ్రాఫిక్స్.
ఇలా అన్నీ భారీగా ఉండటంతో ఈ సినిమా రిజల్ట్ కూడా భారీగానే వచ్చింది.
ప్రభాస్‌ను అంతర్జాతీయ హీరోగా నిలబెట్టిన ఈ సినిమా మొదటి భాగం ‘బాహుబలి – ది బిగెనింగ్’ 2013 జూలై 6న షూటింగ్ మొదలుపెట్టుకుంది.
నేటితో ఈ సినిమాకు ఏడేళ్లు కావడంతో చిత్ర యూనిట్ అలనాటి జ్ఞాపకాలను గుర్తుకుచేసుకుంది.ప్రేక్షకులు అఖండ విజయాన్ని అందించిన బాహులి చిత్రం తమకు చాలా ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
ఇక ఈ సినిమాలో ప్రభాస్ బాహుబలిగా నటించగా రానా దగ్గుబాటి భళ్లాలదేవగా నటించి మెప్పించిన సంగతి తెలిసింది.
రాజమౌళి డైరెక్టర్‌గా తెరకెక్కిన ఈ విజువల్ వండర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ‘బాహుబలి 2’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే.
కాగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లు హీరోగా ఆర్ఆర్ఆర్ అనే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాతో జక్కన్న మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ అందుకోవడనాకి రెడీ అవుతున్నాడు.