ఏడేళ్ల బాలుడి కిడ్నాప్, చేసింది ఎవరంటే!

ఏడేళ్ల బాలుడు కిడ్నాప్ కు గురయ్యాడు.అనంతరం ఆ బాలుడి తండ్రికి ఫోన్ చేసి మూడు లక్షలు కిడ్నాపర్ డిమాండ్ కూడా చేశాడు.

 7 Years Boy Kidnapped By14years Boy In Hyderabad-TeluguStop.com

అయితే ఏమి చేయాలో తెలియక ఆ బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో దర్యాప్తు చేపట్టారు.అయితే వారి దర్యాప్తు లో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇంతకీ ఆ బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తి కేవలం పదో తరగతి చదివే విద్యార్థి అని అధికారులు గుర్తించారు.మంచిగా చదువు కోవాల్సిన వయసులో ఆ 14 ఏళ్ల కుర్రాడు డబ్బుల కోసం ఇంటి ముందు ఆడుకుంటున్న 7 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి అతడి తండ్రిని డబ్బులు డిమాండ్ చేయడం విశేషం.

అంతేకాకుండా ఒక కరుడుగట్టిన కిడ్నాపర్ లా అతడు మాట్లాడిన తీరు కూడా అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.నీ కొడుకు నీకు దక్కాలి అంటే చెప్పిన మొత్తం ఇవ్వాలని లేకపోతె నీ కొడుకు నీకు దక్కడు అంటూ ఆ బాలుడి తల్లి దండ్రులను హెచ్చరించాడు.

ఈ ఘటన హైదరాబాద్ లోని మీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఆదివారం చోటుచేసుకుంది.వివరాల్లోకెళితే.

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న రాజు దంపతులకు అర్జున్ అనే కుమారుడు ఉన్నాడు.ఆ బాలుడు స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతుండగా,ఆదివారం మధ్యాహ్నం కాలనీలో ఆడుకుంటూ కనిపించకుండా పోయాడు.

అయితే ఆ బాలుడు కోసం విచారిస్తున్న ఆ తండ్రికి ఓ అగంతకుడి నుంచి కాల్ వచ్చింది.‘నీ కొడుకును కిడ్నాప్ చేశాను.నీ కొడుకు నీకు దక్కాలంటే రూ.3లక్షలు ఇవ్వు.ఇప్పటికిప్పుడు రూ.లక్ష కావాలి.కొంత సొమ్ము ‘ఫోన్ పే’ చెయ్యు’ అని కిడ్నాపర్ డిమాండ్ చేయడం తో వెంటనే రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు.

Telugu Kidnapped Boy, Telugu Ups-

దీనితో రంగంలోకి దిగిన అధికారులు ఫోన్ కాల్ ఆధారంగా నిందితుడి ఆచూకీ గుర్తించగా అక్కడకు వెళ్లి చూడడం తో అధికారులు ఆశ్చర్యపోయారు.ఆ కాల్ చేసిన వ్యక్తి ఒక పదో తరగతి చదివే కుర్రాడుగా గుర్తించారు.దీనితో కిడ్నాప్‌ అయిన బాలుడిని కాపాడి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.

ఇదంతా కేవలం 3 గంటల్లోనే పూర్తవ్వడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube