టాయ్ లెట్ క‌ట్టించ‌లేద‌ని…తండ్రిపైనే పోలీసుల‌కు పిర్యాదు చేసింది ఆ 7 ఏళ్ళ బాలిక‌.! చివరకు ఏమైందంటే.?

టాయ్ లెట్ క‌ట్టించ‌లేద‌ని తండ్రిపైనే పోలీసుల‌కు పిర్యాదు చేసింది …త‌మిళ‌నాడు కు చెందిన 7 ఏళ్ళ హనిఫా… ఎప్ప‌టిలాగే స్కూల్ కు వెళ్లి…అటు నుండి అటే పోలీస్ స్టేష‌న్ కు చేరి….అక్క‌డ డ్యూటీలో ఉన్న SI ని క‌లిసి….

 7 Year Old Girl Files Complaint Against Father For Not Building Toilet1-TeluguStop.com

ఆంటీ మా నాన్న న‌న్ను చీట్ చేశాడు…ఆయ‌న మీద కేసు పెట్టాల‌ని కోరింది.దీంతో షాక్ అయిన స‌ద‌రు SI అస‌లు విష‌య‌మేంట‌ని ఆరా తీసింది.

నేను LKG లో ఉన్న‌ప్పుడు… క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తే టాయిలెట్ క‌ట్టిస్తాన‌ని ప్రామిస్ చేశాడు…నేను డాడీ చెప్పిన‌ట్టు క్లాస్ ఫ‌స్ట్ వ‌చ్చా…అప్పుడు టాయిలెట్ క‌ట్టించ‌లేదు…1 వ త‌ర‌గ‌తి లో క్లాస్ ఫ‌స్ట్ వ‌స్తే త‌ప్ప‌క క‌ట్టిస్తాన‌ని మాట మార్చాడు… స‌రే అని ఫ‌స్ట్ క్లాస్ లో కూడా నేనే క్లాస్ ఫ‌స్ట్ వ‌చ్చా….అయినా టాయిలెట్ క‌ట్టించ‌లేదు….ఇప్పుడు నేను సెకండ్ క్లాస్… స్కూల్లోనేమో ప్ర‌తి ఇంట్లో టాయిలెట్స్ త‌ప్ప‌క ఉండాలి.అప్పుడే మ‌న‌మంతా నిజ‌మైన పౌరులం అని మా టీచ‌ర్లు చెబుతున్నారు.మాడాడీనేమో ఇంకా ఆయ‌నిచ్చిన మాటను నెర‌వేర్చ‌లేదు.ఈ విష‌యంలో మా డాడీ న‌న్ను చీట్ చేసిన‌ట్టే క‌దా.! అందుకే ఆయ‌న మీద కేసు పెట్టండి అంది హ‌నీఫా.

దీంతో ఆ SI హ‌నిఫా తండ్రి…ఎహ‌సానుల్లాకి కాల్ చేసింది.స్కూల్ నుండి కూతురు ఇంకా ఇంటికి రాలేద‌ని కంగారు ప‌డుతున్న అత‌ను ప‌రిగెత్తుకుంటూ పోలీస్ స్టేష‌న్ కు వ‌చ్చి కూతుర్ని గుండెల‌కు హ‌త్తుకున్నాడు.అస‌లు విష‌యం చెప్ప‌డంతో…తండ్రి కూడా షాక్ కు గుర‌య్యాడు… కానీ ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో త‌నకు టాయిలెట్ క‌ట్టించే స్తోమ‌త లేద‌ని చెప్పాడు.

ఈ విష‌యంలో కాస్త లోక‌ల్ మున్సిపాలిటీ అధికారుల‌కు తెలియ‌డంతో….వారే హ‌నీఫా వాళ్లింట్లో టాయిలెట్ క‌ట్టిస్తామ‌ని మాటిచ్చారు.ఈ విష‌యం ప‌ట్ల హనిఫా ఆనందం వ్య‌క్తం చేసింది.తండ్రి మాత్రం ఇంకా షాక్ లోనే ఉన్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube