టీఆర్ఎస్‌లో 7 గురు మంత్రులు, 25 మంది ఎమ్మెల్యేలు ఫెయిల్‌..!

తెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల గుండెల్లో గుబులు రేగుతోంది.సీఎం కేసీఆర్ తెలంగాణ‌లోని అన్ని పార్టీల‌కు చెందిన ప్ర‌జాప్ర‌తినిధుల ప‌నితీరుపై ఎప్ప‌టిక‌ప్పుడు స‌ర్వేలు చేస్తున్నారు.

 7 Minister And 25 Mlas Failed In Trs-TeluguStop.com

విచిత్రం ఏంటంటే ఈ సర్వేల్లో ఇత‌ర పార్టీల‌కు చెందిన ఎమ్మెల్యేల‌కు మంచి ర్యాంకులు కూడా ఇస్తున్నారు.

త‌మ పార్టీకే చెందిన మంత్రులు, ఎమ్మెల్యేల ప‌నితీరు స‌రిగా లేక‌పోతే వారికి నిర్దాక్షిణ్యంగా త‌క్కువ మార్కులు వేయ‌డంతో పాటు వారిని పిలిచి స్ట్రాంగ్ క్లాసులు పీకుతున్నారు.

ఈ క్ర‌మంలోనే ప‌నితీరు మ‌రీ అధ్వానంగా ఉన్న కొంద‌రు మంత్రుల‌తో పాటు ఎమ్మెల్యేల‌కు ఇదే ప‌రిస్థితి కంటిన్యూ అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు ఇవ్వ‌మ‌ని ఖ‌రాఖండీగా చెప్పేశార‌ని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే జూన్ 2వ తేదీనాటికి టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్ల‌వుతోంది.

ఈ నేప‌థ్యంలోనే ఈ నెల 27న కేసీఆర్ పార్ల‌మెంట‌రీ శాస‌న‌స‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.ఈ స‌మావేశంలో కేసీఆర్ త‌మ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల‌పై మ‌రో షాకింగ్ రిపోర్టును బ‌య‌ట‌పెట్ట‌నున్నార‌ట‌.

ఈ స‌ర్వే వివ‌రాలు పూర్తిగా బ‌య‌ట‌కు రాక‌పోయినా తెలంగాణలో అధికార పార్టీ వ‌ర్గాల్లో వినిపిస్తోన్న చ‌ర్చ‌ల ప్ర‌కారం మంత్రులు జ‌గ‌దీష్‌రెడ్డి, మ‌హేంద‌ర్‌రెడ్డి, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జోగు రామ‌న్న, చందూలాల్‌, ప‌ద్మారావుపై కేసీఆర్ తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్టు తెలుస్తోంది.గ్రేట‌ర్ హైద‌రాబాద్‌కు చెందిన మంత్రి త‌ల‌సానిపై కూడా కేసీఆర్ సంతృప్తిగా లేర‌ట‌.

ఇక కేసీఆర్ ఏ క్ష‌ణంలో అయినా మంత్రివ‌ర్గ ప్రక్షాళ‌న చేస్తే ప‌నితీరు స‌రిగా లేని ఈ మంత్రుల్లో చాలా మందికి ఊస్టింగ్ త‌ప్ప‌దంటున్నారు.దీంతో ఈ మంత్రుల గుండెళ్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి.

ఇక 25 మంది ఎమ్మెల్యే ప‌నితీరు మ‌రీ అధ్వానంగా ఉంద‌న్న రిపోర్టు కేసీఆర్ వ‌ద్ద ఉంద‌ట‌.వీరిలో ఎక్కువుగా ఉత్త‌ర తెలంగాణ జిల్లాల‌కు చెందిన ఎమ్మెల్యేలే ఉన్న‌ట్టు స‌మాచారం.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌రుస‌గా రెండోసారి తిరుగులేని విజ‌యం సాధించాల‌నుకుంటోన్న కేసీఆర్ తీవ్ర ప్ర‌జావ్య‌తిరేక‌త ఎదుర్కొంటోన్న వారికి టిక్కెట్టు ఇచ్చేందుకు సుముఖంగా లేరు.మ‌రి ఈ టైంలో కేసీఆర్ స‌ర్వేల్లో ఫెయిల్ మార్కులు వ‌చ్చిన మంత్రులు, ఎమ్మెల్యేల ఫ్యూచ‌ర్ ఎలా ఉంటుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube