'కేంబ్రిడ్జ్ స్కాలర్'...కి ఎంపికైన భారతీయ విద్యార్ధులు...!!!  

7 Indian Students Owns Cambridge University Scholarship-nri,telugu Nri News Updates

అత్యంత ప్రతిష్టాత్మక యూనివర్సిటీ అయిన కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది. ఎంతో ప్రతిభ చక్కని నైపుణ్యం, మేధో శక్తి ఉంటేనే కాని ఈ యూనివర్సిటీలో చోటు దొరకదని అందరికి తెలిసిందే అయితే ఈ యూనివర్సిటీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కేంబ్రిడ్జ్‌ స్కాలర్‌షిప్‌-2019 కి ఏడుగురు భారతీయ విద్యార్ధులు ఎంపిక అవ్వడం ఎంతో గర్వించదగ్గ విషయం..

'కేంబ్రిడ్జ్ స్కాలర్'...కి ఎంపికైన భారతీయ విద్యార్ధులు...!!!-7 Indian Students Owns Cambridge University Scholarship

దాదాపు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఎంపికైన 90 మంది పోస్టు గ్రాడ్యుయేట్‌లలో భారతీయులు ఏడుగురు ఉండటం గమనార్హం. ఈ మేరకు ఎంపికైన విద్యార్ధుల వివరాలని కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయం ఒక ప్రకటన విడల చేసింది. వీరు ఆయా సబ్జెక్టులలో కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేస్తారని తెలిపింది.

అయితే ఈ 90 మందిలో భారతీయ విద్యార్ధుల వివరాలని పరిశీలిస్తే..

నికిత ముమ్మిడివరపు – హిస్టరీ, ఫిలాసఫీ, ధృవ్‌ నందమూడి – బయాలాజికల్‌, సైన్సెస్‌ , అర్జున్‌ అశోక్‌ – జెండర్‌ స్టడీస్‌, కనుప్రియాశర్మ – క్రిమినాలజీ, రితికా సుబ్రమణియన్‌ – జెండర్‌స్టడీస్‌, అవని వీయిరా – ఆంగ్లం, నిషాంత్‌ గోఖలే – లీగల్‌ స్టడీస్‌ లు ఎంపిక అయినట్టుగా తెలిపారు.