షాకింగ్ న్యూస్..ఏడుగురు “భారతీయుల” కిడ్నాప్     2018-05-06   22:14:33  IST  Bhanu C

విదేశాలలో ఉంటున్న భారతీయులకి రాను రాను రక్షణ కొరవడుతోంది..అమెరికాలో జాత్యహంకార దాడులు జరుగుతున్న తరుణంలో ఇతరదేశాలలో భారతీయులని అపహరణ చేస్తున్నారు..అయితే ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్ వంటి దేశాలలో ఇది సర్వ సాధారణం అవుతోంది..గతంలో కూడా ఇలాగే ఈ దేశాల సాయుధులు భారతీయులే టార్గెట్ గా చేసుకుని కిడ్నాప్ లకి తెగబడటం..లేదా చంపేయడం జరుగుతోంది..అయితే తాజాగా జరిగిన సంఘటనతో భారతీయులకి ఆ ఇరు దేశాలలో భద్రత కోరవడుతోందనే చెప్పాలి.. ఆప్ఘనిస్థాన్‌లోని బాగ్లాన్ రాష్ట్రంలో ఆదివారంనాడు ఏడుగురు భారతీయ ఇంజనీర్లను గుర్తుతెలియని సాయుధులు అపహరించుకు వెళ్లారు…వారితో పాటు ఒక ఆప్ఘన్ ఉద్యోగిని కూడా సాయుధులు ఎత్తుకెళ్లారు. వీరంతా ఇండియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ కేఈసీకి చెందిన ఉద్యోగులని తెలుస్తోంది.

ఈ ఏడుగురు భారతీయ తమకి సొంతగా ఉన్న ఎలక్ట్రిసిటీ సబ్ స్టేషన్ కాంట్రాక్టు కేఈసీ కార్యాలయానికి వీరంతా వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్టు వార్తలు అందుతున్నాయి. అయితే ఈ కిడ్నాప్ సమాచారంపై కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయాన్ని న్యూఢిల్లీలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ సంప్రదిస్తోంది…అయితే భారత్ కి చెందిన ఇండియన్ ఇంజనీర్లు కిడ్నాప్ కి గురయ్యినట్టుగా తెలుస్తోందని అయితే మరిన్ని వివరాల కోసం ఆప్ఘన్ అధికారులను సంప్రదిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి..త్వరలోనే వారి కిడ్నాప్ కి గల కారణాలని తెలుసుకుంటామని తెలిపారు.