ఒకే ఇంట్లో ఆ ఏడుగురు... జీవితాంతం కలిసి ఉండాలని  

7 Girlfriends From China Planning To Retire And Together-frindship,planning To Retire And Together,relationship

చిన్నప్పటి స్నేహితులు పెద్ద వయస్సు వచ్చేసరికి చాలా మంది కలిసి ఉండరు. ఎవరు ఎక్కడ ఉంటారో కూడా ఒక్కో సారి తెలియదు. స్నేహం చిన్న వయస్సు నుంచి చాలా దశలలో మారుతూ వస్తుంది..

ఒకే ఇంట్లో ఆ ఏడుగురు... జీవితాంతం కలిసి ఉండాలని-7 Girlfriends From China Planning To Retire And Live Together

అయితే కొంత మంది చిన్ననాటి స్నేహితులని ఎప్పటికి గుర్తు పెట్టుకుంటారు. కొంత మంది వారినే ప్రాణ స్నేహితులుగా కలిగి ఉంటారు. ఎంత స్నేహితులు అయిన జీవితాంతం కలిసి ఉండటం మాత్రం ఎవరికి సాధ్యం కాదనే అనుకుంటాం.

కాని ఓ ఏడుగురు స్నేహితులు మాత్రం జీవితాంతం కలిసి ఉండేందుకు సిద్ధమయ్యారు.

చిన్నప్పటినుంచి కలిసి చదువుకుంటూ పెరిగిన ఆ స్నేహితులకి విడిగా వుండడం అస్సలు ఇష్టం లేదు. దీంతో అందరూ కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.

దాని కోసం ఓ ఇళ్ళు కొనాలని అనుకున్నారు. ఆలోచనని వెంటనే అమల్లో పెట్టి 4 కోట్లు ఖర్చుపెట్టి ఏడుగురు స్నేహితులు కలిసి తమ డ్రీం హౌస్ కట్టుకున్నారు. అందులో 2008 నుంచి పిల్లా పాపలతో హ్యాపీగా జీవిస్తున్నారు. ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటున్నా కలిసే భోజనం చేస్తారు. అందరూ కలిసే ఉంటారు.

దక్షిణ చైనాలోని గ్వంగ్స్యూలోని 7,535 చదరపు అడుగుల ఇంట్లో నివసిస్తున్న ఈ స్నేహితులు జీవితాంతం ఒకే ఇంట్లో కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం 18 ఏళ్ల వయసు నుంచే సంపాదనా మొదలెట్టిన వీళ్ళు డబ్బుని దాచి పెట్టుకుని ఇల్లు కట్టుకోవాలని అనుకున్నారు. ఇంతలో ఓ ఇల్లు అమ్మకానికి రావడంతో దానిని కొనుక్కొని తమ డ్రీం హౌస్ క్రింద డిజైన్ చేసుకొని అందులో హ్యాపీగా ఉంటున్నారు.