ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ హీరో ప్రస్తుతం అవకాశలు లేక…  

తెలుగులో మొదటి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ సినిమా అవకాశాలు దక్కించుకోలేక తెరమరుగయిన హీరోలు ఎందరో ఉన్నారు.అంతేగాక తన మొదటి చిత్రంతో హిట్ కొట్టి ఓవర్ నైట్ లో స్టార్ అయినటువంటి హీరోలు కూడా చాలా మంది ఉన్నారు.

TeluguStop.com - 7 G Brundavan Colony Movie Hero Ravi Krishna Family And Movie Career News

  అయితే ఇందులో ప్రముఖ దర్శకుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించినటువంటి “7/జి బృందావన కాలనీ” చిత్రంలో హీరోగా నటించిన “రవి కృష్ణ” ఒకరు.

అయితే రవి కృష్ణ తెలుగులో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించినటువంటి ప్రముఖ సినీ నిర్మాత “ఏ.

TeluguStop.com - ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన ఈ హీరో ప్రస్తుతం అవకాశలు లేక…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఎం రత్నం” మూడవ కొడుకు. ఇతడి పెద్ద కొడుకు పరాన్జీ కూడా పలు చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

కాగా  ఏ.ఎం రత్నం కూతురు జ్యోతి కృష్ణ తెలుగులో ఇటీవలే యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా నటించినటువంటి “ఆక్సిజన్” చిత్రానికి నిర్మాతగా వ్యవహరించింది. ఇక హీరో రవి కృష్ణ విషయానికి వస్తే తాను నటించినటువంటి మొదటి చిత్రంతోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.దీంతో 7/జి బృందావన కాలనీ అప్పట్లో బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను కూడా సృష్టించింది.  కానీ తన తదుపరి సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో వరుసగా ప్లాప్ లను ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో కొత్త సినిమా అవకాశాలు దక్కించుకోవడంలో కూడా విఫలమయ్యాడు.

అయితే ఇది ఇలా ఉండగా రవి కృష్ణ తెలుగు, తమిళం భాషల్లో కలిపి దాదాపుగా 8 చిత్రాల్లో హీరోగా నటించాడు.ఇందులో “7/జి బృందావన కాలనీ” తప్ప మిగిలిన అన్ని చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.అయితే ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఎక్కువ సమయం ఇంటి పట్టునే గడుపుతున్నాడు. ఈ క్రమంలో బరువు బాగానే పరిగి ఫిజిక్ కోల్పోయాడు.అంతేగాక ఇటీవలే తన బంధువుల వేడుకకి హాజరైన రవి కృష్ణ గుర్తు పట్టలేని  విధంగా మారిపోయాడు.

#RaviKrishna #7/gBrundavan #7/gBrundavan #Ravi Krishna #Producer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

7 G Brundavan Colony Movie Hero Ravi Krishna Family And Movie Career News Related Telugu News,Photos/Pics,Images..