రానున్న రోజుల్లో అంతరించిపోనున్న ఏడు ఫూడ్ ఐటమ్స్ ఇవే..  

ప్రకృతి మనకు ఎన్నో వనరులను ప్రసాదించింది..వాటిని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేస్తు పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం..దాని మూలంగా అటు పర్యావరణానికి ఇటు మనకు మనమే హాని చేసుకుంటున్నాం..తత్ఫలితంగా మనం రోజువారి మన ఆహారపుటలవాట్లలో భాగాలైన కొన్నింటిని దూరం చేసుకోవాల్సొస్తుంది..అది కూడా శాశ్వతంగా..

అరటి పండు

7 Food Items That Can Disappear In Future-

7 Food Items That Can Disappear In Future

ట్రాపికల్ రేస్ 4 అనే వైరస్ వలన అరటి ఉత్పత్తి క్రమక్రమంగా తగ్గిపోతుంది.మనం శుభకార్యాలప్పుడు, ఎవరింటికైనా వెళ్లేప్పుడు తీసుకెల్లడానికి వాడే ముఖ్యమైన పండ్లలో మొదటిస్థానం అరటిపండుది..కానీ కొంతకాలానికి అరటి జాతి మొత్తం అంతరించిపోనుంది.

కాఫీ

7 Food Items That Can Disappear In Future-

చాలామందికి ఉదయం లేవగానే కాఫీ తాగే అలవాటుంటుంది..అలాంటి కాఫీ ప్రియులు గుండె దిటవు చేసుకోవాల్సిన పరిస్థితి ఇది..వాతావరణంలో వస్తున్న మార్పుల వలన కాఫీగింజలు అందించే మొక్కలు 2080నాటికి పూర్తిగా అంతరించిపోనున్నాయని నిఫుణులు చెపుతున్నారు.

వేరుశెనగ

7 Food Items That Can Disappear In Future-

భూమిమీద పెరుగుతున్న వేడి కారణంగా వేరుశెనగ సరిగా పెరగక, ఉత్పత్తి తగ్గిపోనుంది..గత కొంతకాలంగా వేరుశెనగ దిగుబడి చాలా వరకు తగ్గింది..రానున్న పది పదిహేనేండ్ల కాలంలో వేరుశెనగ సామాన్యుడికి అందుబాటులో ఉండకపోవచ్చు..ఇక దీన్ని కూడా ఖరిదైన జీడిపప్పు,బాదం లాంటి డ్రైఫ్రూట్స్ జాబితాలో చేర్చొచ్చు.

ఛాక్లెట్స్

7 Food Items That Can Disappear In Future-

మీరు చాక్లెట్స్ ప్రియులైతే ఇది మీకు చేదు వార్తే..ఎందుకంటే మరొక ముప్పై ఏండ్లలో ఛాక్లెట్స్ పూర్తిగా అంతరించిపోనున్నాయి..వర్షాలు సరిగా లేకపోవడం వలన ఛాక్లెట్స్ తయారికి వినియోగించే పదార్దాలు లభించక 2050 నాటికి ఛాక్లెట్స్ తయారి నిలిచిపోనుందట.

వైన్

7 Food Items That Can Disappear In Future-

ద్రాక్షపండ్లను పులియబెట్టి వైన్ తయారుచేస్తారని మనందరికి తెలిసిందే..వర్షాలు తగ్గిపోవడం వలన ద్రాక్ష ఉత్పత్తి తగ్గిపోనుంది.తత్పలితంగా మంచి వైన్ కూడా దొరకకపోవచ్చు.

ఆరెంజ్

7 Food Items That Can Disappear In Future-

ప్రపంచ వ్యాప్తంగా సిట్రస్ గ్రీన్ డిసీజ్ అనేది వ్యాపించి ఆరెంజ్ పూర్తిగా అంతరించిపోనుంది..ఈ తెగులు ఎంత ఫాస్ట్ గా వ్యాపిస్తుందంటే భవిష్యత్ లో మీరు ఆరెంజ్ చెట్టు కూడా చూడలేకపోవచ్చు.

అవకాడో

7 Food Items That Can Disappear In Future-

ఇతర మొక్కలతో పోలిస్తే ఈ మొక్కలకు నీరు ఎక్కువ అవసరం అవుతుంది..కరువు మూలంగా వర్షాలు తగ్గిపోతూ ,నీటి వనరులు తగ్గిపోతుంది..తద్వారా మొక్కలకు అందే నీటిశాతం తగ్గిపోతుంది..రానున్న రోజుల్లో అవకాడో కూడా పూర్తిగా అంతరించిపోనుంది..

ఇది కేవలం హెచ్చరిక మాత్రమే ఇదే విధంగా మనం పర్యావరణానికి హాని చేయడం స్టార్ట్ చేస్తే కాలుష్యం పెరిగి ,మనం జీవనం,మనిషి మనుగడే ప్రశ్నార్దకమయ్యే ప్రమాదం ఉంది…