కరోనా కేసులు ఒక్కటి కూడా నమోదు అవ్వని 7 దేశాలు ఏంటో తెలుసా..!

నేడు యావత్ ప్రపంచం కరోనా కారణంగా బాధ పడుతున్న విషయం తెలిసిందే.రోజురోజుకూ కరోనా మహమ్మారి మళ్ళీ విజృంభిస్తుంది.

 7 Countries In The World Where Covid-19 Never Touched Details, North Korea, Omic-TeluguStop.com

తగ్గినట్టే తగ్గి మళ్ళీ కొత్త వేరియంట్ తో స్ట్రాంగ్ గా మన ముందుకు వచ్చింది.ఓమిక్రాన్ రూపంలో భారీ ముప్పు తప్పదని ఆరోగ్య నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు.

మరి మీరు ఎప్పుడైనా ఆలోచించారా.భూమి మీద ఇప్పటి వరకు కరోనా వైరస్ లేని దేశం ఏదైనా ఉందా.ఒక్క కేసు కూడా నమోదు అవ్వని దేశాలు కూడా ఉన్నాయట.ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 7 దేశాలు ఉన్నాయట.

ఈ ఏడూ దేశాల్లో కరోనా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదట.మరి ఆ దేశాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.

నౌరు :

ఆస్ట్రేలియాలోని ఈ ప్రాంతంలో మైక్రోనేషియా లో ఉంది ఈ దేశం.ఇది ఒక చిన్న ద్వీపం.

ఈ దేశం మొత్తం జనాభా 10,834 కాగా వీరికి 2021లో 100 శాతం వ్యాక్సిన్ లు వేయించింది అక్కడి ప్రభుత్వం.ఈ దేశంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

Telugu Covid Touched, Cook Islands, Covid, Kiribati, Korea, Nouru, Omicron Ups,

తురుమెనిస్థాన్:

ఈ దేశం మధ్య ఆసియాలో ఉంది.ఈ దేశ ప్రభుత్వం స్వదేశానికి వెళ్లే విమానాలు మినహా సరిహద్దులన్నిటిని పూర్తిగా మూసివేసింది.ఈ దేశంలో 18 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న ప్రజలందరికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించింది.ఈ దేశంలో కూడా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.

టోకెలావ్ హవాయి:

న్యూజిలాండ్ మధ్యలో ఉన్న చిన్న చిన్న ద్వీపాల సమూహమే ఈ దేశం… ఇది ప్రసిద్ధ పర్యాటక దేశం కూడా కాదు.విదేశీ ప్రయాణికుల తాకిడి కూడా తక్కువే.

ఈ దేశంలో కూడా ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.ఈ దేశంలో ప్రజలందరికి రెండు డోసుల వ్యాక్సిన్ వేయించారు.

Telugu Covid Touched, Cook Islands, Covid, Kiribati, Korea, Nouru, Omicron Ups,

కుక్ ఐలాండ్స్:

దక్షిణ ఫసిఫిక్ లో ఉన్న కుక్ దీవులు. ఈ దేశంలో మొత్తం 17,459 జనాభా ఉండగా వీరిలో 97 శాతం ప్రజలు టీకాలు వేయించుకున్నారు.ఇప్పటి వరకు ఈ దేశంలో ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు.

తువాలు:

బ్రిటీష్ కామన్వెల్త్ లో భాగం అయినా ఒక ద్వీపమే ఈ దేశం.సరిహద్దులను పూర్తిగా మూసివేసి.ప్రయాణికులను కూడా నిషేదించింది.ఏప్రిల్ 2021లో దేశం మొత్తం మీద భారీ స్థాయిలో వ్యాక్సిన్ అమలు చేసింది అక్కడి ప్రభుత్వం.

Telugu Covid Touched, Cook Islands, Covid, Kiribati, Korea, Nouru, Omicron Ups,

డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ కొరియా:

ఉత్తర కొరియా ఇంకా ప్రయాణికులను ఈ దేశంలోకి అనుమతి ఇవ్వడం లేదు.అలాగే ఆహారం, ఇతర వస్తువుల దిగుమతి కూడా నిలిపి వేసింది.ఈ దేశంలో జీరో కోవిద్ కేసులు ఉన్నట్టు ప్రభుత్వం అనౌన్స్ చేసింది.

కిరిబాటి:

ఇది ఒక ఐలాండ్ రిపబ్లిక్. దీనిని రిపబ్లిక్ ఆఫ్ కిరిబాటి అని పిలుస్తారు.

ఫసిఫిక్ మహాసముద్రంలో ఇది ఉంది.ఈ ద్వీపం కరోనా స్టార్ట్ అయినప్పుడే సరిహద్దులు మూసేసింది.

దీంతో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా ఈ దేశంలో నమోదు కాలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube