6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్..!

సోనూసూద్.సినిమా ఇండస్ట్రీలో కానీ సమాజంలో కానీ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

 6million Followers Sonusood Twitter-TeluguStop.com

సోనూసూద్ సినిమాలలో విలన్ క్యారెక్టర్స్ చేసినా కానీ, రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అనిపించుకుంటున్నాడు.ఇక ముఖ్యంగా గత ఏడాది కరోనా మహమ్మారి లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ప్రజలకు తన వంతు సహాయం అందజేశాడు సోనుసూద్.

ఎవరైనా ఆపదలో ఉన్నారని తెలిస్తే వెంటనే స్పందించి తగిన సహాయం అందించాడు.ఎంతో మంది ఆకలిని తీర్చాడు సోను.

 6million Followers Sonusood Twitter-6 మిలియ‌న్స్‌ క్లబ్ లోకి సోనూసూద్..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com


అంతేకాకుండా ఎవరైనా సహాయం కోసం అతడిని ఆశ్రయించగా ఎప్పుడూ కూడా ముందు ఉండి వారికీ సహాయం చేసాడు.ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా సోనూసూద్ కి చాలా మంది అనేక రిక్వెస్ట్ లు కూడా పెట్టారు.

అన్నిటికీ కూడా సమాధానం ఇస్తూ సాయం చేసుకుంటూ ముందుకు వచ్చాడు సోనూసూద్.తాజాగా సోషల్ మీడియాలో సోనూసూద్ కు  ఫాలోవర్స్ సంఖ్య 6 మిలియ‌న్స్‌కు చేరుకోవడం విశేషం.60క్షల మంది అభిమానులను సొంతం చేసుకున్న సోనూసూద్ కు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.ఇటీవల మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో 10 ఆక్సిజన్ సిలిండర్స్ దానంతో తనవంతు సహాయంగా సోనుసూద్ ముందంజలో ఉన్నారు.

ఇక సినిమాల విషయానికి వస్తే.ప్రస్తుతం సోనూసూద్ మెగాస్టార్ చిరు ప్రధాన పాత్ర పోషిస్తున్న, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఆచార్య సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు.

వీటితో పాటు టాలీవుడ్ లో మరికొన్ని సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు.

#Twitter #Corona Virus #Sonusood #Sonu Sood #Social Media

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు