తెలంగాణాలో 67 శాతం పోలింగ్ నమోదు !  

తెలంగాణాలో ఎన్నికల తంతు ప్రశాంతంగా పూర్తయ్యిందని ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ వెల్లడించారు. ఎక్కడా ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఎన్నికల తంతు ముగించమని… అందుకే ఎక్కడా రీపోలింగ్‌కు ప్రతిపాదనలు రజత్‌ అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 67 శాతం పోలింగ్‌ నమోదైందని ఆయన తెలిపారు. ఆదిలాబాద్‌ జిల్లాలో అత్యధికంగా 76.5శాతం పోలింగ్‌ నమోదైందని, అత్యల్పంగా హైదరాబాద్‌లో 50 శాతం పోలింగ్‌ నమోదైందన్నారు.

67% Polling In Telangana-

67% Polling In Telangana

13 సమస్యాత్మక ప్రాంతాల్లో 70 శాతం, వరంగల్‌ రూరల్‌లో 76 శాతం పోలింగ్, 2014 కంటే ఈసారి పోలింగ్ శాతం తగ్గిందని ఈసీ రజత్‌ కుమార్‌ తెలిపారు. 754 ఈవీఎంలను మార్చాల్సి వచ్చిందని చెప్పారు. ఇబ్బందులు తలెత్తడంతో 1,.444 వీవీప్యాట్లను మార్చామని, గల్లంతైన ఓట్లపై జాబితా సవరణపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు.