ఫిల్మింఫేర్ అవార్డుల్లో సత్తా చాటిన రంగస్థలం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ రంగస్థలం ఎలాంటి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిందో అందరికీ తెలిసిందే.క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి రామ్ చరణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

 66th South Filmfare Awards-TeluguStop.com

ఈ సినిమాలో చరణ్ యాక్టింగ్‌కు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి.కాగా తాజాగా రంగస్థలం చిత్రం ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డుల్లో దుమ్ములేపింది.ఉత్తమ హీరోగా రామ్ చరణ్ రంగస్థలం చిత్రానికి గాను అవార్డు దక్కించుకున్నాడు.రంగస్థలం చిత్రంతో పాటు మహానటి చిత్రం కూడా 66వ దక్షిణాది ఫిలింఫేర్ అవార్డులలో సత్తా చాటింది.

2018లో విడుదలైన దక్షిణాది చిత్రాలలో ఉత్తమ అవార్డులను చెన్నైలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగిన సౌత్ ఫిలింఫేర్ అవార్డుల్లో అందించారు.ఈ అవార్డుల వేడుకకు టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండల్‌వుడ్ ఇండస్ట్రీల నుండి పలువురు నటీనటులు హాజరయ్యారు.

ఇక తెలుగులో ఎవరెవరికి అవార్డులు దక్కాయో చూద్దామా.

ఉత్తమ చిత్రం- మహానటి

ఉత్తమ దర్శకుడు- నాగ్‌ అశ్విన్

ఉత్తమ నటుడు- రామ్‌ చరణ్‌ (రంగస్థలం)

ఉత్తమ నటి- కీర్తి సురేశ్‌ (మహానటి)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్ విభాగం)- దుల్కర్‌ సల్మాన్‌ (మహానటి)

ఉత్తమ నటి (క్రిటిక్స్ విభాగం)- రష్మిక మందన్న (గీతా గోవిందం)

ఉత్తమ సహాయ నటి- అనసూయ భరద్వాజ్‌ (రంగస్థలం)

ఉత్తమ సహాయ నటుడు- జగపతిబాబు (అరవింద సమేత వీరరాఘవ)

ఉత్తమ సినిమాటోగ్రాఫర్- రత్నవేలు (రంగస్థలం)

ఉత్తమ సంగీత దర్శకుడు- దేవీ శ్రీ ప్రసాద్‌ (రంగస్థలం)

ఉత్తమ గేయ రచయిత- చంద్రబోస్‌ (ఎంత సక్కగున్నావే-రంగస్థలం)

ఉత్తమ నేపథ్య గాయకుడు- సిద్ శ్రీరామ్ (ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే – గీత గోవిందం)

ఉత్తమ నేపథ్య గాయని- శ్రేయా ఘోషాల్‌ (మందరా మందరా – భాగమతి)

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube