66 యేళ్ల వయస్సులో తల్లి అయ్యింది.. కొడుకు చనిపోవడంతో ఇంత సాహసం చేసింది.. ఒక అమ్మ జీవితం

ప్రస్తుత జీవన విధానం మరియు తీసుకునే ఆహారపు అలవాట్ల కారణంగా సంతాన లేమి అనేది ఎక్కువగా ఉంటుంది.వందలో 15 శాతం జంటలు సంతాన లేమితో బాధ పడుతున్నారు.30 యేళ్లు దాటిన వారికి సంతాన భాగ్యం 50 శాతం వరకు అనుమానమే అంటూ వైధ్యులు చెబుతున్నారు.ఇక 50 సంవత్సరాలు దాటిన వారికి సంతాకం కలుగదు అంటూ వైధ్యులు తేల్చి చెబుతున్నారు.

 66 Year Old Gujrati Woman Gives Birth To A Baby Boy-TeluguStop.com

కాని పట్టుదలతో 66 ఏళ్ల ఒక మహిళ తల్లి అయ్యి చరిత్ర సృష్టించింది.ఆమె తన వారసుడి కోసం ఏ మహిళ పడని కష్ట పడి అందరికి షాక్‌ ఇచ్చింది.

గుజరాత్‌కు చెందిన మధుబెన్‌ గహ్లెతా మరియు శ్యామ్‌భాయ్‌ గహ్లెతా దంపతులు 2016వ సంవత్సరంలో జరిగిన ఒక యాక్సిడెంట్‌ లో చేతికి అంది వచ్చిన కొడుకును పోగొట్టుకున్నారు.కూతురు మినహా మిగిలిన అంతా కూడా చనిపోయారు.దాంతో ఆ వృద దంపతులు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు.వారి బాధను కూతురు చూడలేక పోయింది.డాక్టర్‌ అయిన కూతురు వారిని మళ్లీ తండ్రులను చేయాలనుకుంది.అందుకోసం ఆమె ఏ కూతురు చేయని పని చేసింది.

తన తల్లి దండ్రులకు వారసులను ఇవ్వాలని నిర్ణయించుకుంది.అందుకోసం ఆమె తన తల్లిని మళ్లీ తల్లి చేయాలనుకుంది.అందుకోసం టెస్ట్‌ ట్యూబ్‌ బేబిని ఆశ్రయించింది.50 ఏళ్లు దాటిన వారికి టెస్ట్‌ట్యూబ్‌ బేబీ పద్దతి ఏమాత్రం సమంజసం కాదని కొందరు అడ్డు చెప్పారు.కాని తల్లిదండ్రులను ఒప్పించి ఆ కూతురు గట్టి ప్రయత్నం చేసింది.ఆమె ప్రయత్నం ఫలించింది.తాజాగా తల్లి శ్యామ్‌ భాయ్‌ తల్లి అయ్యింది.

66 ఏళ్ల వయస్సులో తల్లి అయిన శ్యామ్‌భాయ్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అరుదైన తల్లిగా రికార్డు పొందారు.

బామ్మ అయిన తర్వాత మళ్లీ తల్లి అయిన వ్యక్తిగా గతంలో పలువురు నిలిచారు.కాని 66 ఏళ్ల వయస్సులో తల్లి అవ్వడం అనేది చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు.

వారసుడి కోసం, ఈ వయస్సులో తోడు కోసం వారు తీసుకున్న నిర్ణయం మంచిదే కాని, వారు తనువు చాలించే సమయంకు ఆ కుర్రాడు పెద్దవాడు అయితే పర్వాలేదు, చిన్నవాడిగా ఉన్నప్పుడే వారు తిరిగి రాని లోకాలకు వెళ్తే ఆ కుర్రాడి పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నరు.ఆ ప్రశ్నకు తాను తమ్ముడిని కొడుకులా చూసుకుంటాను అంటూ శ్యామ్‌బాయ్‌ కూతురు చెబుతున్నారు.

మొత్తానికి ఈ వింత కుటుంబ కథ చాలా ఆసక్తికరంగా ఉంది.అమ్మ అవ్వాలనే ఉత్సాహంతో శ్యామ్‌భాయ్‌ చేసిన పనికి అంతా కూడా ఫిదా అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube