అస్సాంలో కల్తీ మద్యం తాగి 66 మంది మృతి!

ఈ మధ్యకాలంలో ప్రజలు వాడే ప్రతి వస్తువుని కల్తీ చేసేస్తూ ప్రజల ప్రాణాలతో వ్యాపారం ముసుగులో ఆడుకుంటున్నారు.ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం, అవినీతి వెరసి ఈ కల్తీ మాఫియాకి అడ్డు అదుపు లేకుండా పోతుంది.

 66 Dead After Consuming Illicit Liquor In Assams Golaghat-TeluguStop.com

చివరికి మాదకద్రవ్యాలని కూడా కల్తీ చేసేస్తూ సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.అధికారులు లంచగొండితనం కారణంగా ఈ కల్తీ వ్యాపారుల బాగోతాలు దర్జాగా సాగించేస్తున్నారు.

తాజాగా అస్సాంలో కల్తీ మద్యం తాగి సుమారు 66 మంది ప్రాణాలు కోల్పోయారు.ఇంకా మృతులు సంఖ్య పెరిగే అవకాశం వుందని అంచనా వేస్తున్నారు.

జూగిబారి ప్రాంతంలో కల్తీ మద్యం తయారు చేస్తూ అక్కడ చుట్టూ పక్కల అమ్మకాలు నిర్వహిస్తూ వుంటారు.అలాగే గురువారం టీ గార్డెన్ వర్కర్స్ కల్తీ మద్యం తాగారు.

తరువాత వారంతా తీవ్ర అస్వస్థతకి గురి కావడంతో సమీపంలో హాస్పిటల్స్ కి తరలించారు.అయితే కల్తీ మద్యం ప్రభావం వలన తాగినవారు చనిపోవడం మొదలైంది.

అలా కల్తీ మద్యం తాగడం వలన ఇప్పటి వరకు 66 మంది తమ ప్రాణాలు కోల్పోయారు.దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.

ఇక ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకి ఆదేశించింది.అలాగే కల్తీ మద్యం అమ్మకాలని పట్టించుకోకుండా వున్నా ఎక్సైజ్ అధికారులని సస్పెండ్ చేసారు.

ఇక కల్తీ మద్యం బారిన పడిన వారిలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం వుందని డాక్టర్స్ చెబుతున్నారు.మరి ఈ సంఘటన పై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube