ఫైన్ కట్టమంటే ఏకంగా బండే పోలిసుల చేతిలో పెట్టాడు.ఎందుకో తెలుసా?

హెల్మెట్ పెట్టుకోకపోతే వెయ్యి జరిమానా.ఫోన్ మాట్లాడుతూ బండి నడిపితే ఇంకో వెయ్యి యాభై రూపాయలు జరిమానా.

 635 Traffic Violation Cases On This Scooter-TeluguStop.com

ఒకసారి ఇలా ఫైన్ పడితే ఫైన్ కట్టేకంటే హెల్మెట్ కొనుక్కోవడం ఉత్తమం అనుకుంటాం.కాని ఫైన్ కట్టేకంటే బండే పోలిసులకు ఇచ్చేస్తామా.

కాని ఒక వ్యక్తి ఇచ్చాడు.ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకుంటే నవ్వాపుకోలేరు.

సాధారణంగా మన బైక్ లేదా స్కూటర్ పై ఫైన్ పడగానే కంగారు పడిపోతాం.చలానాలు నిర్ణీత మొత్తం దాటితే పోలీసులు కేసు నమోదు చేస్తారేమోనని భయపడతాం.కానీ, మైసూర్ లోని రాచనగరి ప్రాంతంలో ఇందుకు భిన్నమైన, ఫన్నీ సంఘటన చోటుచేసుకుంది.రాచనగరి ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపట్టారు.ఈ సందర్భంగా కేఏ09హెచ్ డీ 4732 నంబర్ ఉన్న స్కూటర్ ను పోలీసులు గుర్తించారు.రికార్డులు పరిశీలించగా, ఈ స్కూటర్ పై ఒకటి కాదు.

రెండు కాదు.ఏకంగా 635 కేసులు ఉన్నట్లు తెలుసుకున్న పోలీసులు విస్తుపోయారు.మొత్తం జరిమానాలను లెక్కించి రూ.63,500 కట్టాల్సిందిగా బండి యజమానికి చలానా ఇచ్చారు.

అసలు కంటే కొసరే ఎక్కువయిందన్నట్లు స్కూటర్ ఖరీదు కంటే జరిమానా మొత్తం ఎక్కువ కావడంతో సదరు యజమాని తెలివిగా స్పందించాడు.తాను ఈ స్కూటర్ అమ్మేసినా రూ.63,500 కట్టలేననీ, కాబట్టి ఈ బండిని మీరే ఉంచుకోండని పోలీసులకు ఇచ్చేసి, ఎంచక్కా అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.దీంతో అవాక్కవడం పోలీసుల వంతయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube