దేవుడా.. వాటి దాడిలో 63 అరుదైన పెంగ్విన్స్‌ మరణం.. ఎక్కడో తెలుసా...?

పెంగ్విన్స్‌ గురించి మన అందరికి తెలిసిందే.కానీ పెంగిన్స్ పక్షులు అంతరించి పోతున్న సమయంలో ఇలాంటి దురదృష్టకర ఘటన జరగడం అనేది నిజానికి బాధాకరమైన విషయం అనే చెప్పాలి.

 63 Rare Species Penguins Died In Honey Bees Attact In South Africa Cape Town, Ra-TeluguStop.com

ఒకటా రెండా ఏకంగా 63 అరుదైన పెంగ్విన్స్‌ తేనె తీగల దాడిలో చనిపోవడం అందరికి షాకింగ్ గా ఉంది.చనిపోయిన పెంగ్విన్స్‌ మృతదేహాలకు పోస్టుమార్టం చేయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

తేనె తీగలు చాలా ప్రమాదకరనైనవి.అవి కుట్టినప్పుడు మనుషుల ప్రాణాలు సైతం పోయిన సంఘటనల గురించి మనం చాలానే విని ఉంటాము.

ఈ క్రమంలోనే తేనెటీగల గుంపు పెంగిన్స్ పై దాడి చేయడంతో అవి ప్రాణాలు కోల్పోయాయి.అసలు వివరాల్లోకి వెళితే.

ఈ పెంగ్విన్ లు దక్షిణాఫ్రికాలోని కేఫ్‌ టౌన్‌ వెలుపల బీచ్‌ లో నివాసం ఉంటున్నాయి.

దక్షిణాఫ్రికా తీరం, దీవులలో నివసించే ఆఫ్రికన్‌ పెంగ్విన్స్‌ ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ కన్జర్వేషన్‌ ఆప్‌ నేచర్‌ రెడ్‌ లిస్టులో ఉన్నాయి.

అసలే ఇవి అంతరించిపోతున్న జాతి.ఈ క్రమంలోనే 63 అరుదైన పెంగ్విన్స్‌ చనిపోవడం ఆశ్చర్యకరంగా ఉంది.

చనిపోయిన పెంగ్విన్స్ ను సైమన్స్‌ టౌన్‌, కేఫ్‌ టౌన్‌ సమీపంలో గల ఒక పట్టణంకు పోస్టమార్టం నిమిత్తం తీసుకెళ్లాగా తేనెటీగల దాడిలో మరణించినట్లు దక్షిణ ఆఫ్‌రికన్‌ ఫౌండేషన్‌ తెలిపింది.ఈ తేనెటీగలు పెంగ్విన్స్‌ కళ్ల చుట్టు కుట్టడం వలన చనిపోయాయని డేవిడ్‌ రాబర్ట్స్‌ అనే క్లినికల్‌ పశువైద్యధికారి తెలిపారు.

అంతేకాకుండా పెంగ్విన్స్ శరీరంపై మరే ఇతర గాయాలు లేవని, తేనె తీగల కుట్టిన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు.

Telugu Rare Penguins, Attack, African, Latest-Latest News - Telugu

అలాగే చనిపోయిన పెంగిన్స్ ప్రదేశంలో కొన్ని చనిపోయిన తేనెటీగలు కూడా గుర్తించినట్లు ఆఫ్రికల్‌ ఫౌండేషన్‌కు డేవిడ్ తెలియజేశాడు.ఇలాంటి సంఘటనలు జరగడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని ఆయన తెలిపారు అలాగే ఇప్పుటికే అంతరించిపోతున్న పెంగ్విన్స్ ఇలా చనిపోవడం దురదృష్టకరమైన విషయం అని రాబర్ట్స్‌ పేర్కొన్నారు.కాగా మరిన్ని పరీక్షల కోసం చనిపోయిన పెంగ్విన్స్‌ నమూనాలను మరింత పరిశీలిస్తున్నామని దక్షిణాఫ్రికా జాతీయ ఉద్యానవన శాఖ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube