‘ఎన్టీఆర్‌’ ఇలా ఉంటే అభిమానులకు నిరాశే ఇక!

దర్శకుడు క్రిష్‌ తెరకెక్కిస్తున్న ‘ఎన్టీఆర్‌’ చిత్రం జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.తెలుగు వారి గుండెల్లో అన్నగారిలా చోటు సంపాదించుకున్న నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

 63 Getups And 12 Remix Songs In Ntr Biopic-TeluguStop.com

సినీ, రాజకీయ రంగాల్లో విశేష కృషి చేసిన ఎన్టీఆర్‌కు ఒక పార్టు సరిపోదనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్నాడు.మొదటి పార్టులో ఎన్టీఆర్‌ సినీ కెరియర్‌, రెండో పార్టులో రాజకీయ రంగంలో తన ప్రతిభను చూపించబోతున్నారు.

ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ పాత్రలో ఆయన తనయుడు బాలక్రిష్ణ నటిస్తున్నాడు.

ఇటీవల కాంలో బయోపిక్‌లకు ఆదరణ ఎక్కువయినందున ఈ చిత్రంపై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి.పైగా ఈ చిత్రంలో ఆయన తనయుడు నటిస్తుండడం, అంతేకాకుండా తెలుగు వారందరికి సుపరిచితుడు అయిన ఎన్టీఆర్‌ జీవిత చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటికే విడుదలయిన ట్రైలర్‌ అంచనాలను అంతకంతకు పెంచుతోంది.

అయితే ఈ చిత్రంలో ఎన్టీఆర్‌వి 12రీమిక్స్‌ పాటలు, 63గెటప్‌లు చూపించనున్నారు.

ఎంత సినిమా రంగంలో ఎన్టీఆర్‌ ప్రతిభని చూపించాలనుకున్న కేవలం వాటితోనే సినిమా అంత నడిపిస్తే అసలు బాగోదు.63 గెటప్‌లు, 12 పాటలు అంటే వీటికే దాదాపు గంటన్నర పడుతుంది.ఇకపోతే మిగిలిన గంటలో ఏం చూపించబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.

ఎన్టీఆర్‌ బాల్యం, యవ్వనం, వైవాహిక జీవితంలోని పలు కీలక అంశాలను చూపించబోతున్నారు అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇవేవి చూపించకుండా కేవలం ఆయన గెటప్‌తోనే సరిపిస్తే ఈ చిత్రంలో బాలక్రిష్ణ ఎన్టీఆర్‌లో కనిపించినా కూడా ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరిస్తారు.

ఎందుకంటే ఎన్టీఆర్‌ గత చిత్రాలు, డాన్స్‌ు వీడియోలు రూపంలో కూడా లభిస్తాయి కాబట్టి వాటిలో కొత్త ఏం ఉంటుంది, అందుకే తెర వెనుక ఎన్టీఆర్‌ను చూపిస్తేనే ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube