విడ్డూరం: మగతోడు లేకుండా ఏడు గుడ్లు పెట్టిన కొండచిలువ!

సాధారణంగా ఏ జంతువైనా మగ తోడు ఉంటే మాత్రమే గుడ్లు పెట్టగలదు.అయితే ఒక కొండచిలువ మాత్రం 20 ఏళ్లుగా మగతోడు లేకపోయినా గుడ్లు పెట్టింది.

 62-year-old Python In Us Zoo Lays Seven Eggs Without Male Help, Old Python , Us,-TeluguStop.com

దీంతో షాక్ అవ్వడం జూ సిబ్బంది వంతయింది.మిస్సోరిలోని సెయింట్ లూయిస్ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది.62 సంవత్సరాల వయస్సు ఉన్న కొండ చిలువ ఒకేసారి ఏడు గుడ్లను పెట్టడంతో అది గుడ్లు ఎలా పెట్టిందో అర్థం కాక జూ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.

జూ హెర్పటాలజీ మేనేజర్ మార్క్ వానర్ ఈ ఘటన గురించి స్పందిస్తూ కొండ చిలువ గుడ్లు పెట్టడంతో తాము ఆశ్చర్యానికి లోనయ్యామని… కొండచిలువ ఏ విధంగా గుడ్లు పెట్టిందో తమకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదని అన్నారు.

లైంగిక చర్యలో పాల్గొనకుండా గుడ్లు పెట్టడం అసాధారణం అయినప్పటికీ అసాధ్యం మాత్రం కాదని చెప్పారు.అయితే లేటు వయస్సులో కొండచిలువ గుడ్లు పెట్టడం తామెప్పుడూ వినలేదని పేర్కొన్నారు.

62 సంవత్సరాల వయస్సులో కొండచిలువ గుడ్లు పెట్టిందని… రాటిల్ స్నాక్స్, కొమొడో డ్రాగన్లు జాతులకు చెందిన పాములు సైతం లైంగిక చర్యలో పాల్గొనకుండానే గుడ్లను పెట్టగలవని… ఈ కొండ చిలువ విషయంలో కూడా అదే విధంగా జరిగి ఉండవచ్చని తెలిపారు.కొండ చిలువ మొత్తం ఏడు గుడ్లను పెట్టగా ఆ గుడ్లలో రెండు గుడ్లు జీవం కోల్పోగా మూడు గుడ్లను ఇంక్యుబేటర్ లో ఉంచారు.

మిగిలిన రెండు గుడ్లు మాత్రం అధికారులు పరీక్షల కోసం పంపించారు.గుడ్ల జన్యు నమూనాను పరిశీలించి గుడ్లు ఏ విధంగా ఉత్పత్తి అయ్యాయో పరిశోధకులు తెలుసుకోనున్నారు.పరిశోధనల అనంతరం గుడ్లు లైంగికంగా ఉత్పత్తి అయ్యాయో లేక అలైంగికంగా ఉత్పత్తి అయ్యాయో తెలియనుంది.ప్రస్తుతం సోషల్, వెబ్ మీడియాలో ఈ ఘటన వైరల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube