కరోనా వ్యాక్సిన్ వద్దంటోన్న భారతీయులు.. కారణమేమిటంటే..?  

61 percent Indian people reject corona vaccine,corona vaccine, side effects, corona deaths, India, corona effect - Telugu 61 Percent Indian People Reject Corona Vaccine, 61 Percent People, Corona Deaths, Corona Effect, Corona Vaccine, India, Indians, Local Circles Survey, Side Effects

భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది.నెలలు గడుస్తున్నా పరిస్థితిలో పెద్దగా మార్పు రావడం లేదు.

TeluguStop.com - 61 Percent Indian People Reject Corona Vaccine

ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కరోనా కేసులు, వందల సంఖ్యలో కరోనా మరణాలు నమోదవుతున్నాయి.అయితే కరోనా విజృంభించిన తొలినాళ్లతో పోలిస్తే ప్రజల్లో వైరస్ గురించి భయం అంతకంతకూ తగ్గుతోంది.అన్ లాక్ సడలింపుల వల్ల దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి.
2020 చివరినాటికి లేదా 2021 జనవరి నాటికి కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.అయితే దేశంలోని చాలామంది ప్రజలు కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి సిద్ధంగా లేరని ఒక సర్వేలో వెల్లడైంది.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా వేర్వేరు కారణాల వల్ల చాలామంది కరోనా వ్యాక్సిన్ ను వేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.

లోకల్‌ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

TeluguStop.com - కరోనా వ్యాక్సిన్ వద్దంటోన్న భారతీయులు.. కారణమేమిటంటే..-General-Telugu-Telugu Tollywood Photo Image

దేశంలోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 25,000 మందిపై సర్వే చేసి ఫ్రీగా ఇచ్చినా వ్యాక్సిన్ వేయించుకోవడానికి 61 శాతం మంది సుముఖంగా లేరని.

కరోనా వ్యాక్సిన్ వల్ల కొత్త ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తాము భావిస్తున్నారని తెలుస్తోంది.కరోనా మహమ్మారి వల్ల ఆందోళన పెరిగిగిందని 33 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.19 శాతం మంది మాత్రం కరోనా వల్ల తమ జీవన విధానంలో పెద్దగా మార్పు రాలేదని పేర్కొన్నారు.

అయితే వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు మాత్రం ప్రజల్లో నెలకొన్న అపోహల వల్ల వాళ్లు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండవచ్చని.

ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే ప్రజల్లో అభిప్రాయం మారుతుందని తెలుపుతున్నారు.వచ్చే ఏడాది జనవరి నాటికి ఏదో ఒక వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

#LocalCircles #Corona Effect #Corona Deaths #India #Side Effects

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

61 Percent Indian People Reject Corona Vaccine Related Telugu News,Photos/Pics,Images..