బ్రేకింగ్ : ఏపీ సచివాలయంలో కరోనా విలయ తాండవం..!!

ఏపీ సచివాలయంలో ఏకంగా 60 మంది ఉద్యోగస్తులకు కరోనా పాజిటివ్ తేలింది.ఉద్యోగస్తులతో పాటు వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ రావడం జరిగింది.

 60 Positive Cases In Ap Sachivalayam-TeluguStop.com

ఆర్థిక శాఖలో పని చేసే అసిస్టెంట్ సెక్రటరీ కరోనాతో ఇటీవల మృతి చెందడం జరిగింది.దీంతో కొవిడ్ భయంతో చాలామంది ఉన్నత అధికారులు సచివాలయానికి రాని పరిస్థితి నెలకొంది.

పరిస్థితి ఇలా ఉండగా ప్రతి శుక్రవారం ప్రభుత్వం సచివాలయంలో కరోనా పరీక్షలు నిర్వహిస్తూ ఉంది.

 60 Positive Cases In Ap Sachivalayam-బ్రేకింగ్ : ఏపీ సచివాలయంలో కరోనా విలయ తాండవం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నిన్న దాదాపు 200 మందికి కరోనా పరీక్షలు చేయడం జరిగింది.

ఈ విధంగా సచివాలయంలో కరోనా విలయతాండవం సృష్టిస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు విజయవాడ లోని వివిధ హెచ్ఓడీ కార్యాలయాల నుండి విధులు నిర్వహిస్తున్నారు.తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితి చాలా దారుణంగా ఉంది.

ఒక్కసారిగా ఊహించని విధంగా కేసులు పెరిగిపోవటంతో ప్రభుత్వం అలర్ట్ అవుతున్న గాని… కొత్త కేసులు కుప్పలుతెప్పలుగా బయట పడుతుండటంతో రాష్ట్రంలో కరోనాడేంజర్ బెల్స్ స్టార్ట్ అయ్యాయి.ఈ క్రమంలో ఒక పక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం చాలా శరవేగంగా చేసే   తరహాలో ఏపీ ప్రభుత్వం ముందడుగు వేస్తుంది.

 

#Andhra Pradesh #Sachivalayam

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు