ఆడుకోవాల్సిన వయసులో శోధన.. వెలుగులోకి కోట్ల ఏళ్ల నాటి శిలాజం, ఆరేళ్ల ఎన్ఆర్ఐ బాలుడి ఘనత

భూమిపై తొలి నుంచీ మనిషి లేడు.మనకంటే కోట్ల సంవత్సరాలకు ముందే చిన్నవీ, పెద్దవీ, అతి పెద్దవీ ఎన్నో జీవులు ఈ నేలపై సంచరించాయి.

 6-yr-old Indian-origin Boy Finds Millions Of Years Old Fossil In Uk Garden, Sidd-TeluguStop.com

కాలక్రమంలో కొన్ని అంతరించిపోయాయి.లక్షల, కోట్ల సంవత్సరాల క్రితం బతికిన, మనం ఎప్పుడూ చూడని ఆ జీవుల ఆకారం, అవి తినే ఆహారం, ఇంకా ఎన్నో విశేషాలను మనం తెలుసుకోగలుగుతున్నామంటే అది శిలాజాల (ఫాసిల్స్‌) వల్లనే సాధ్యమైంది.

ఇక అసలు విషయంలో వెళితే.ఆరేళ్ల వయసంటే అమ్మానాన్నల్ని తప్పించి, బంధువుల్ని కూడా గుర్తుపట్టడం కష్టం.తన తోటి ఫ్రెండ్స్‌తో ఆటలాడుతూ.ఇల్లు పీకి పందిరి వేస్తారు బుజ్జిగాళ్లు.

అలాంటిది అంత లేత ప్రాయంలో శాస్త్రవేత్తగా మారి.తలపండిన వారి కన్నా మిన్నగా కోట్ల సంవత్సరాల నాటి శిలాజాలను కనిపెట్టే పనిని భుజానికెత్తుకుని అనుకున్నది సాధించాడో చిన్నారి.

వివరాల్లోకి వెళితే.బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి కుటుంబానికి చెందిన ఆరేళ్ల సిద్ధక్ సింగ్ ఝామత్‌.

అతనిని కుటుంబసభ్యులు, సన్నిహితులు సిద్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

ఈ చిన్నారికి క్రిస్మస్ కానుకగా .శిలాజాలను అన్వేషించే కిట్ లభించింది.వీటి సాయంతో సిధ్ తన ఇంటి పరిసరాల్లో శోధించడం మొదలుపెట్టాడు.

కీటకాలు, పురాతన మట్టి వస్తువులు, ఇటుకలు ఏమైనా దొరుకుతాయేమోనన్న ఆశతో తవ్వుకుంటూ వెళ్లాడు.ఈ క్రమంలో వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లోని వారి వ్యవసాయ క్షేత్రంలో సిధ్ తవ్వుతుండగా ఓ కొమ్ములాంటి శిల ఆ బాలుడికి కనిపించింది.

అది ఏదో జంతువుకు సంబంధించిన దంతం లేదా గోరు లేదా కొమ్ము అయివుంటుందని తోచింది.అయితే అది ఒక పగడపు దిబ్బకు చెందిన భాగమని తండ్రి చెప్పగా తెలిసింది.

దీనిని ‘హార్న్ కోరల్’ అంటారని సిధ్ వెల్లడించాడు.

Telugu England, Horn Coral, Siddhaksingh, Birmingham, Singh-Telugu NRI

ఫేస్‌బుక్‌లోని ఒక శిలాజ బృందంలో సభ్యుడిగా వున్న సిధ్ తండ్రి విష్ సింగ్… సదరు శిలాజానికి చెందిన విషయాలను వెల్లడించాడు.దీని వయసు 25.1 కోట్ల నుంచి 48.8 కోట్ల సంవత్సరాల వాటివని తెలిపారు.ఇది లభించిన చోట సముద్ర నత్తలు, స్క్వి‌డ్స్ వంటి వాటిని కూడా ఆ బాలుడు కనుగొన్నాడు.

ఇక వీటి వయసు కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందని అంచనా.ప్రస్తుతం ఐరోపా ఖండంలో వున్న ఇంగ్లాండ్ భూభాగం.కోట్ల ఏళ్ల క్రితం పాంజియా అనే ఖండంలో, సముద్రం అడుగుభాగాన ఉండేదని తెలిపారు.ఈ నేపథ్యంలో సిధ్ కనుగొన్న శిలాజం గురించి బర్మింగ్ హామ్ యూనివర్సిటీ అనుబంధం మ్యూజియం ఆఫ్ జియాలజీకి చెప్పనున్నారు విష్ సింగ్ బృందం

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube