ఆరేళ్ళు పూర్తి చేసుకున్నబాలయ్య బాబు లెజెండ్....

నందమూరి నటసింహం, లెజెండ్ బాలయ్య బాబు 2014వ సంవత్సరంలో నటించిన లెజెండ్ అనే చిత్రం ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులకు బాగానే గుర్తుంటుంది.అంతేకాక ఈ చిత్రంలో బాలయ్య బాబు చెప్పేటువంటి “లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా” అంటూ చెప్పే డైలాగ్ బాగా పాపులర్ అయింది.

 6 Years For Balayya Babu Legend Movie, Balayya Babu, Balayya Babu Movie News, B-TeluguStop.com

అంతేకాక సమాజంలో ఆడపిల్ల పుట్టుకపై ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చెప్పేటువంటి డైలాగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఈ చిత్రానికి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించగా ప్రముఖ సినీ నిర్మాత అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు.

అయితే ఈ చిత్రం విడుదలయ్యే సరిగ్గా నేటితో 6 సంవత్సరాలు అయ్యింది.దీంతో ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులకి తెలిపారు.

అయితే ఈ చిత్రం తర్వాత  బాలయ్య బాబుకి సరైన హిట్ పడలేదు.కానీ ఈ చిత్రం మాత్రం అప్పట్లో టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది.అంతేకాక బాలయ్య బాబు పవర్ ఫుల్ డైలాగులు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేశాయి.అయితే ఈ చిత్రంలో బాలయ్య బాబు సరసన రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు.

అలాగే ప్రతినాయకుడి పాత్రలో సీనియర్ హీరో జగపతి బాబు నటన పరంగా ఈ చిత్రంలో బాలయ్య బాబుకి బాగానే పోటీ ఇచ్చాడు.అంతేగాక విలన్ గా జగపతి బాబుకి ఈ చిత్రం మంచి కమ్ బ్యాక్  ఇచ్చింది.

Telugu Balayyababu, Balayya Babu, Boyapati Sreenu-Movie

అయితే ప్రస్తుతం బాలయ్య బాబు మళ్లీ బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నాడు.ఈ చిత్రంలో బాలయ్య బాబు ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు సమాచారం.అయితే ఇందులో అఘోరా పాత్రలో కూడా నందమూరి బాలకృష్ణ కనిపిస్తున్నట్లు ఇప్పటికే పలువురు సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు.అయితే ఇటీవలే ఈ చిత్రం విజయవంతంగా మొదటి షెడ్యూల్ చిత్రీకరణను పూర్తిచేసుకుంది.

అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కలకలం సృష్టిస్తున్న డంతో ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ని వాయిదా వేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube