ఆరేళ్ళకే 50 కోట్ల ఇళ్ళు కొన్న కొరియన్ బాలిక! ఎలానో తెలుసా

చిన్న వయస్సు పిల్లలు మహా అయితే వీధిలో ఆడుకుంటారు.సందడి చేస్తారు, అల్లరి చేస్తారు.

 6 Year Old Youtube Star Known For Toy Reviews Buys Property Worth Rs 55 Crores1-TeluguStop.com

ఈ మధ్య కాలంలో అయితే తల్లిదండ్రులు ఇచ్చిన సెల్ ఫోన్ లో బొమ్మలు చూసుకోవడం, గేమ్స్ ఆడుకోవడం చేస్తున్నారు.అయితే దక్షిణ కొరియాలో ఆ ఆరేళ్ళ బాలిక ఏకంగా ఇంత చిన్న వయస్సులో 50 కోట్ల విలువ చేసి ప్రాపర్టీ కొనుగోలు చేసింది.

ఇప్పుడు ఈ వార్త ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది.ఇదిల్ ఎలా సాధ్యం అవుతుంది అందరూ తలలు పట్టుకుంటున్నారు.

అయితే ఈ పాప సంపాదన నెలకి 21 లక్షలు అని తెలిస్తే ఇంకా ఆశ్చర్యపోతారు.

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత యుట్యూబ్ తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా చాలా మంది డబ్బు సంపాదిస్తున్నారు.

ఇప్పుడు దక్షిణ కొరియాకి చెందిన ఈ ఆరేళ్ళ చిననారి కూడా యుట్యూబ్ ద్వారా నెలకి 21 లక్షలు సంపాదిస్తుంది.ఈమె నడుపుతున్న యుట్యూబ్ చానల్ కి ఏకంగా 13 లక్షల మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు.ఈ చిన్నారి మార్కెట్లో రిలీజయ్యే ఆట వస్తువులపై రివ్యూలు చేసి తన యూట్యూబ్ ఛానెల్‌లో పెడుతుంది.‘బోరమ్ టాయ్ రివ్యూస్’ ఛానెల్‌లో ఆమె రిలీజ్ చేసే రివ్యూలు దక్షిణ కొరియాలో బాగా పాపులర్.అభిమానులు ఆమెను బోరమ్ అని పిలుస్తుంటారు.దాదాపు 13 లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఆ చిన్నారి పోస్ట్ చేసే వీడియోల కోసం కళ్లలో ఒత్తులేసుకుని ఎదురుచూస్తుంటారు.తాజాగా ఈ చిన్నారి తన సంపాదనతో ఏకంగా 55 కోట్ల విలువైన ఓ పెద్ద బంగళా కొనుగోలు చేయడం దక్షిణ కొరియాలో సంచలనం సృష్టించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube