రాత్రికి రాత్రే స్టార్ అయిన ఆఫ్రికా చిన్నారి  

6 Year Old Sa Girl Whose Dance Video Has Gone Growing In Hollywood-hollywood,six Years Old Girl,south Africa,దక్షిణాఫ్రికా,సోషల్‌ మీడియా

సోషల్ మీడియా పుణ్యమా అని టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా రాత్రికి రాత్రే స్టార్ లుగా మారిపోతున్నారు. ఇప్పుడు తాజాగా ఆ విధంగా స్టార్ గా మారింది ఆరేళ్ల ఆఫ్రికా చిన్నారి. ఈ చిన్నారికి ఉన్న టాలెంట్ ఏంటంటే డాన్స్..

రాత్రికి రాత్రే స్టార్ అయిన ఆఫ్రికా చిన్నారి -6 Year Old SA Girl Whose Dance Video Has Gone Growing In Hollywood

ముద్దుగా,బొద్దుగా ఉన్న ఆ పాప లయబద్దంగా చేస్తున్న డ్యాన్స్ కు హాలీవుడ్ అగ్రతారలు అందరూ కూడా ఫిదా అయిపోతున్నారు అంటే అతిశయోక్తి కాదు. ఆ చిన్నారి ఇవానా చేసిన డ్యాన్స్ వీడియో ను అమెరికా కు చెందిన ప్రముఖ గాయని లిజో అధికారిక ట్విట్టర్ పేజీ లో షేర్ చేయడం తో ఆ చిన్నారి రాత్రికి రాత్రే స్టార్ అయిపొయింది. ఆ చిన్నారి డ్యాన్స్ చూసి హాలీవుడ్‌ నటులు క్రిస్‌ ఇవాన్స్‌, విల్‌స్మిత్‌ కూడా అభిమానులుగా మారిపోయాయి.

వీరు కూడా తమ వ్యక్తిగత సోషల్‌ మీడియా పేజీల్లో ఈ చిన్నారి వీడియోలు షేర్‌ చేయడంతో ఆమెకు ఆదరణ అమాంతంగా పెరిగిపోయింది.

దక్షిణాఫ్రికాలోని పోర్ట్‌ ఎలిజబెత్‌ నగరానికి చెందిన ఇవానా మే 30న ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టగా, అప్పుడే ఆమె సుమారు లక్షా 90 వేల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. ఆమె పెట్టిన 12 పోస్ట్‌లను లక్షలాది మంది వీక్షించారు. ఆ పోస్ట్ లలో ఇవానా డ్యాన్స్, హావభావాలు చూసిన అందరూ కూడా అద్భుతమని తెగ పొగిడేస్తున్నారు. ఇవానా వీడియోలకు లక్షల్లో లైకులు, వ్యూస్‌ రావడంతో ఇంటర్నెట్‌ టాప్‌ ట్రెండింగ్‌ లిస్ట్‌లో ఆమె వీడియోలు చోటు దక్కించుకున్నాయి.