కొడుకులు తల్లితో చనువుగా ఉంటే మంచి బుద్ధులు వస్తాయి .. ఎలాగో చూడండి  

6 Reasons How A Mother’s Boy Would Only Have Good Habits -

దాదాపుగా ఏ కుటంబాన్ని చూసుకున్నా, కూతుళ్ళు తల్లిందండ్రులతో ఉన్నంత చనువుగా కొడుకులు ఉండరు.అలా ఎందుకు అంటే చాలా కారణాలుంటాయి.

బయటి ప్రపంచానికి ఎక్కువ అలవాటు పడటంతో బయట స్నేహితులతోనే ఎక్కువ సమయం గడిపేందుకు ఆసక్తి చూపిస్తారు అబ్బాయిలు.ఎంత కాదన్నా, అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిల్లో ఎమోషనల్ వాల్యూస్ తక్కువ.

6 Reasons How A Mother’s Boy Would Only Have Good Habits-Telugu Health - తెలుగు హెల్త్ టిప్స్ ,చిట్కాలు-Telugu Tollywood Photo Image

అందుకే, ఓ వయసుకి వచ్చేదాకా కుటుంబ విలువలు, కుటుంబంతో గడిపే క్షణాల విలువ పెద్దగా అర్థం కాదు.కాని కుటుంబంతో తక్కువగా, ముఖ్యంగా తల్లితో తక్కువ సమయాన్ని గడపడం వలన నష్టపోయేది అబ్బాయిలే.

వారికి మంచి బుద్ధులు అలవడాలంటే తల్లితో చనువుగా ఉండాలి.చిన్నప్పటినుంచి తల్లే బాధ్యత తీసుకోని కొడుకు తనని ఒక బెస్ట్ ఫ్రెండ్ లా ట్రీట్ చేసేలా మార్చుకోవాలి.

ఎందుకంటే ….

* మనిషి అనేవాడు ఎవరిని గౌరవించినా, గౌరవించకపోయినా, తన తల్లిని మాత్రం గౌరవిస్తాడు.

ఎదుటి వ్యక్తని ఎలా గౌరవించాలి, ముఖ్యంగా మహిళల పట్ల మర్యాదపూర్వకంగా ఎలా మెదలాలి, ఎందుకు మెదలాలి అనే విషయాలు తల్లి దగ్గరే పిల్లలు నేర్చుకునేది.

* కొడుకు తల్లితో చనువుగా ఉండటం వలన చిన్ననాటి నుంచే స్త్రీ పట్ల ఓ ఆరాధ్యభావం మొదలవుతుంది.

అమ్మాయిలని చులకనగా చూడటం, అగౌరవపరచడం లాంటి లక్షణాలు ఉండకూడదంటే, తల్లి దగ్గరే మగబిడ్డ ప్రపంచం గురించి నేర్చుకోవాలి.ఆడవారు బలవంతులు అనే ముద్ర కొడుకుల మెదడులో పడిపోవాలి.

* ట్యూషన్స్ కి, స్పెషల్ క్లాసెస్ కి పంపడం కాదు, బిడ్డలని తల్లి చదివిస్తేనే మేలు.ఎందుకంటే జ్ఞానం ఎక్కడైనా సంపాదించవచ్చు, కాని విలువలు, విచక్షణ తల్లిదండ్రులు తప్ప ఇంకెవరు నేర్పరు.

అందులోనూ తల్లి ప్రభావం ఎక్కువ ఉంటుంది.

* తల్లికొడుకుల బంధం వేరు.

తల్లి ఫ్రెండ్ లా ఉంటే ఈ విషయాన్ని దాచకోడు కొడుకు.దాంతో చిన్నచిన్న తప్పులు కూడా తెలుసుకోని, వాటిని అప్పటికప్పుడే సరిదిద్ది, తప్పులు పొరపాట్ల నుంచి అలవాట్లుగా మారకుండా చూసుకోవచ్చు.

* మద్యం కాని, సిగరేట్ కాని, ఈ అలవాట్లు తల్లికి ఉండవు.కాని తల్లి ప్రభావం కన్న స్నేహితుల ప్రభావం ఎక్కువ ఉంటే అవే అలవాటు అవుతాయి.

అలా కాకుండా తల్లి ప్రభావం ఎక్కువ ఉంటే అలాంటివి ఏవైనా అలవాటు చేసుకునే ముందు ఒకటి పదిసార్లు ఆలోచిస్తాడు కొడుకు.

* తల్లితో చనువుగా ఉన్నవాడికి తన తల్లి గొప్పదనం తెలుసు.

తన తల్లి మీద ప్రేమ ఉన్నవాడికి తన పిల్లలకి తల్లి కాబోతున్న స్త్రీ మీద కూడా ప్రేమ ఉంటుంది.తన తల్లి కష్టాలు పడితే తన భార్య అలాంటి కష్టాలు పడకూడదు అనుకుంటాడు.

ఆమెని కష్టపెట్టడు.

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

6 Reasons How A Mother’s Boy Would Only Have Good Habits- Related....