ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డ్.. ఒక్కరోజులో 6 లక్షలమందికి టీకాలు..!

ఓ పక్క కరోనా రోజు రోజుకి ఉదృతంగా మారుతుండగా మరోపక్క కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశాయి రాష్ట్రాలు.ఇక ఏపీలో బుధవారం ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో కరోనా టీకాలు వేశారు.

 6 Lakh People Vaccinated In Ap Single Day Record-TeluguStop.com

ఏపీలో ఒక్కరోజే ఏకంగా 6,17,182 మందికి టీకాలు వేసినట్టు తెలుస్తుంది.దేశం మొత్తం మీద ఒక్కరోజులో ఇన్ని లక్షల టీకాలు వేయించిన తొలి రాష్ట్రంగా ఆంధ్ర ప్రదేశ్ మొదటిస్థానంలో నిలిచింది.

ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా 68,358 మందికి ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగిందని తెలుస్తుంది.అంతకుముందు రోజుకి 1.25 లక్షల మందికి మాత్రమే టీకాలు వేశారు.ఈసారి రికార్డ్ స్థాయిలో టీకాలు వేశారు.

 6 Lakh People Vaccinated In Ap Single Day Record-ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ రికార్డ్.. ఒక్కరోజులో 6 లక్షలమందికి టీకాలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కేంద్రం నుండి వచ్చిన 6.40 లక్షల కోవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను పంపిణీ చేశారని తెలుస్తుంది.దేశంలో ఇన్ని లక్షల టీకాలను ఒక్కరోజులోనే పూర్తి చేయడం ఇదే మొదటిసారి.రాజస్థాన్, మహారాష్ట్రలలో రోజుకి 2 లక్షల టీకాలను వేస్తున్నారు.నిన్నటివరకు రోజుకి 2 లక్షలు మాత్రమే హయ్యెస్ట్ కాగా ఏపీలో ఏకంగా మూడు రెట్లు అంటే 6 లక్షలకు పైగా వ్యాక్సినేషన్ వేసి రికార్డ్ సృష్టించారు.అయితే నిన్నటితోనే కేంద్రం పంపించిన వ్యాక్సిన్లు పూర్తి కాగా కొత్త వాటికోసం ఎదురుచూస్తున్నట్టు తెలుస్తుంది.

 ఇక నుండి ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మరింత వేగవంతం చేస్తుకున్నారు.రోజుకి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్న మొత్తాన్ని ప్రకలకు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

#Record #Vaccinated #Single Day #6 Lakh People

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు