కొన్ని వీడియోలు పాతవి అయినా సరే చూస్తే వావ్ అనిపిస్తాయి.ఆ వీడియో పాతది అయి ఉండచ్చు కానీ అందులో ఉండే కంటెంట్ మాత్రం ఎప్పటికి కొత్తగానే ఉంటుంది.
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న ఫీలింగ్ ఆ వీడియోలో కనిపిస్తుంది.ఇంకా ఈ నేపథ్యంలోనే నిన్న అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున వేడుకలు చేసుకున్నారు.
పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు.సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది వారి ఫ్రెండ్స్ ని ట్యాగ్ చేస్తూ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్కడ చుసిన ఆనందంతో వెలిగిపోయే ముఖాలే కనిపించాయి.ఈ సంతోషాల శుభాకాంక్షలు మధ్య ఓ పాత వీడియో వైరల్ అవుతుంది.
ఆ వీడియో చూస్తే మన చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తాయి.
అంతగా ఆ వీడియోలో ఏముంది అనుకుంటున్నారా అక్కడికే వస్తున్న.
కల్మషం లేని మనసు.కల్మషం లేని నవ్వు అందులో కనిపిస్తున్నాయి.
అరుగురు పిల్లలు ఒకే గొడుగు కింద పుస్తకాలు, పలకలు పట్టుకుని బడి నుండి వస్తున్నట్టు ఉంది.చాలీచాలని గొడుగు అయినా సర్దుకుపోయి వర్షంలో నవ్వుతు వెళ్తున్నారు.
ఆ వీడియో చూస్తే ఎవరైనా సరే వావ్ అని అనాల్సిందే.అంతబాగుంది ఆ వీడియో.
మరి మీరు ఓసారి ఆ వీడియో చూసేయండి.మీ చిన్ననాటి మిత్రులను గుర్తుచేసుకోండి.