యోనిలో దురదకు అందుబాటులో ఉన్న 6 టెస్టులు  

6 Basic Tests To Detect The Reason Behind L Itching-

యోనిలో దురద అనేది చాలా కామన్ ప్రాబ్లం.దాదాపుగా అందరికి ఉండేదే.

కాని కొంతమందిని ఈ సమస్య హద్దులు మీరి ఇబ్బందులు పెడుతుంది.నరకం చూపిస్తుంది.అలాంటివారు తక్షణమే ఈ సమస్యనుంచి తప్పించుకోవాలి.అలా తప్పించుకోవాలి అంటే ముందుగా దురద రావడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలి.

6 Basic Tests To Detect The Reason Behind L Itching- --

అప్పుడే పరిష్కారం మార్గం సులువుగా అర్థం అవుతుంది.మరి కారణం ఏమిటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి ? టెస్టు చేయించుకోవాలి.

ఇలాంటి విషయాల్లో అస్సలు మొహమాటపడకూడదు.మొహమాటంతోనే నష్టాన్ని కొనితెచ్చుకుంటారు జనాలు.

ఈ యోనిలో లో దురద, అంటే వెజైనల్ ఇట్చింగ్ వెనుక కారణం కనిపెట్టేందుకు ఆరు బేసిక్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి.అవేంటో చూడండి.

* స్వాబ్ టెస్టింగ్ :

ఇది కొద్దిగా క్లిష్టమైన పరీక్ష.కాని కంగారు పడొద్దు.మూడు స్పాంజ్ స్వాబ్స్ ని యోనిలో పెడతారు.ఆ తరువాత బ్లాడర్ లోకి మేతిలిన్ బ్లూ పంపించి, ఓ పది పదిహేను నిమిషాల తరువాత స్వాబ్స్ బయటకి తీసి వాటిని ల్యాబ్ కి పంపిస్తారు.

అక్కడ ఆ స్వాబ్స్ మీద మైక్రోబయోలాజి టెస్టు నిర్వహించి కారణం ఏమిటో తెలుసుకుంటారు.

* ఫ్లూడ్ టెస్టింగ్ :

దురద, పుండ్లు, కురుపులు .ఇలాంటి సమస్యలు తీవ్రం అయితే ఒకలాంటి ద్రవం బయటకి వస్తుంది.ఈ ఫ్లూడ్స్ ని తీసుకొని, దానిలోని ఇన్ఫెక్షన్ ఏమిటో, ఎలా వచ్చిందో చూస్తారు.

ఈ పధ్ధతి కొన్ని ఎక్స్ ట్రీం కండిషన్స్ లో పాటిస్తారు.

* స్కిన్ బయోప్సీ :

సమస్య తీవ్రత, ఇన్ఫెక్షన్, లక్షణాలు .

అన్ని చర్మం మీదే కనిపిస్తే ఇన్ఫెక్షన్ సోకినా చర్మ కణాల్ని స్కిన్ బయోప్సి ద్వారా బయటకి తీస్తారు.వాటిని టెస్టు చేస్తారు.

* జెనిటల్ ఎగ్జామినేషన్ :

జెనిటల్ ఎగ్జామినేషన్ అనేది చాలా సింపుల్ పరీక్ష.మైక్రోస్కోప్ సహాయంతో యోని, యోని పరిసరాల్ని, వాల్వాని దీక్షగా పరీక్షిస్తారు.

ఎలాంటి బ్యాక్టీరియా వలన ఇలాంటి ఇబ్బంది తలెత్తిందో తెలుసుకునే సింపుల్ పరీక్ష ఇది.

* బ్లడ్ టెస్ట్ :

ఇది మీకు తెలిసినదే.కొన్నిసార్లు రక్తంలో టాక్సిన్స్ వలన కూడా దురద పుట్టొచ్చు.కేవలం రక్తమే దురదకి కారణం కావచ్చు లేదా రక్తంలోనే క్లూ దొరకొచ్చు.

అందుకే బ్లడ్ టెస్టు నిర్వహిస్తారు.

* అలర్జీ టెస్ట్ :

ఏదైనా అలర్జీ వలన దురద పుట్టిందేమో అని తెలుసుకోవడానికి అలర్జీ టెస్టింగ్ చేస్తారు.దీన్నే పాట్చ్ టెస్టింగ్ అని కూడా అంటారు.

కొన్ని కేసుల్లో మెడికల్ హిస్టరిలో కారణాలు దొరకవచ్చు.కాబట్టి మీ మెడికల్ హిస్టరీతో పాటు మీ తల్లిదండ్రుల మెడికల్ హిస్టరీ కూడా అడుగుతారు.జీన్స్ వలన కూడా సమస్యలు వస్తాయి కదా.

తాజా వార్తలు

6 Basic Tests To Detect The Reason Behind L Itching- Related....