క్లినిక్‌లలో రోగులకు గ్రీటింగ్ కార్డులు: ఐదేళ్ల ఎన్ఆర్ఐ చిన్నారి పెద్ద మనసు

ఐదేళ్ల వయసంటే తోటి పిల్లలతో ఆడుకుంటూ, ఇల్లంతా అల్లరి చేస్తూ సాగే పసితనం.ఆ సమయంలో చుట్టూ వున్న ప్రపంచం, ఎదుటి వ్యక్తి కష్టం లాంటి పెద్ద పెద్ద మాటలు ఆ చిన్నారులకు తెలియదు.

 5-year-old Indian-origin Girl Makes Hundreds Of Cards For Nursing Home Residents-TeluguStop.com

వారి బుల్లి ప్రపంచంలో వాటికి తావు లేదు.కానీ ఓ ఐదేళ్ల చిన్నారి మాత్రం కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని సంతోషంగా ఉంచాలని భావించింది.

అనుకున్నదే తడవుగా స్వయంగా వందలాది గ్రీటింగ్ కార్డులు తయారు చేసి నగరంలోని క్లినిక్‌లకు పంపింది.

వివరాల్లోకి వెళితే.

న్యూయార్క్‌లోని వెస్టల్‌కు చెందిన ఐదేళ్ల భారత సంతతి చిన్నారి అరణ్య చోప్రా సెలవుల సీజన్‌ కావడంతో క్లినిక్‌లలో చికిత్స పొందుతున్న వారికి మధురానుభూతి కలిగించాలని భావించింది.ఇందు కోసం వందలాది కార్డులు తయారు చేసి పంపింది.

వాటిని అందుకున్న వారు అరణ్యను లిటిల్ ఏంజిల్ అంటూ ప్రశంసిస్తున్నారు.గ్రీటింగ్ కార్డులు తయారు చేయడానికి తన కిడ్డి బ్యాంక్‌లోంచి ఖర్చు చేసింది.

Telugu Aranya Chopra, Aranyamother, Hundreds Cards, Angel, York-Telugu NRI

దీనిపై అరణ్య తల్లి షాచి మాట్లాడుతూ… తన కుమార్తె ఒక రోజున బిజి బిజీగా గ్రీటింగ్ కార్డులు గీయడాన్ని చూసింది.వాటి గురించి ఆరా తీయగా, ఈ కార్డులను తాను నర్సింగ్ హోమ్‌లోని రోగులకు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పిందని షాచి గుర్తుచేసుకున్నారు.అరణ్య మంచి మనసును ప్రోత్సహకంగా షాచి చోప్రా స్థానిక నర్సింగ్ హోమ్‌ను సంప్రదించి, అందులో 200 మంది రోగులు వున్నట్లు తెలుసుకుని వచ్చారు.అన్ని కార్డులను అరణ్య స్వయంగా తయారు చేసి, ఓ కేక్‌ను సైతం క్లినిక్‌కు పంపింది.

అరణ్య తండ్రి బహుమతులు, కార్డులను స్థానిక నర్సింగ్‌లో అందజేశారు.ఆమె మంచి మనసును మెచ్చుకుంటూ పలువురు ప్రశంసిస్తున్నారు.

సోషల్ మీడియాలో సైతం లిటిల్ ఏంజిల్ అంటూ అరణ్యను నెటిజన్లు ఆకాశానికెత్తేశారు.కాగా, అమెరికాలో నిన్న 2,05,923 కొత్త కేసులు వచ్చాయి.

దీంతో మొత్తం కేసులు 2,08,77,957కి చేరాయి.నిన్న ఒక్కరోజే కోవిడ్ కారణంగా 1,942 మంది చనిపోవడంతో… మొత్తం మరణాలు 3,58,517కి చేరాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube