అమెరికాలో 5కె రన్ సక్సెస్...!!!  

5k Run Success In America-

అమెరికాలో సువిధ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని నగరం, శాక్రమెంటొలో మార్చ్ 30న 5కె రన్ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల పజలు మొదలు వివిధ కళాశాలల విద్యార్ధినీ విద్యార్ధులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ఈ కార్యక్రమాన్ని సువిధ సంస్థ ప్రతినిధులు అయిన భాస్కర్ వెంపటి, పద్మ ప్రియా మద్ది, అవినాష్ మద్ది, వందన శర్మ మరియు వికాస్ కపాడియా తదితరులు ప్రారంభించారు..

5k Run Success In America--5K Run Success In America-

రెండు తెలుగు రాష్ట్రాలలో సువిధ ఫౌండేషన్ సంస్థ నిర్వహిస్తున్నఎన్నో కార్యక్రమాల సహాయార్ధం ఈ రన్ నిర్వహించడం జరిగిందని ఆ సంస్థ ప్రతినిధి భాస్కర్ వెంపటి తెలిపారు.

ఈ సందర్భంగా సంస్థ చేసే పలు కార్యక్రమాల గురించి స్థానికంగా ఉంటున్న తెలుగు వారికి తెలిపారు.

అలాగే అక్కడి తెలుగువారికి వ్యాయామం పై కూడా అవగాహన కలిగించేందుకు 5కె రన్‌ను నిర్వహించినట్లు తెలిపారు.ప్రతీ ఒక్కరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే తప్పకుండా వ్యాయామం అవసరమని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమానికి తెలుగు వారు భారీగా పాల్గొన్నారు.