4G పాతబడిపోయింది 5G వచ్చేస్తోంది

టెక్నాలజీ విషయంలో చైనా మనకంటే చాలా ముందంజలో ఉందని ఒప్పుకోవడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు.ముఖ్యంగా టెలికాం, మొబైల్ రంగంలో చైనా స్థానమే వేరు.

 5g Services To Roll Out In China-TeluguStop.com

ప్రపంచంలోనే అత్యధికంగా మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి చేస్తున్న దేశం చైనా.ఇదంతా చెప్పేబదులు మన దేశానికి, చైనాకి మధ్యగల ఓ తేడా చెప్తాం వినండి.

ఈ ఆర్టికల్ చదవుతున్నవారిలో ఎంతమంది దగ్గర 4G ఫోన్లు ఉండుంటాయి? మొన్న జియో వచ్చేదాకా మనకి అసలు 4G నెట్వర్క్ పై సరైన అవగాహనే లేదు.జియో 4G విప్లవం తీసుకొచ్చిన తరువాత కూడా మన దేశంలో 4G సేవలు పొందుతున్న వారు ఇంకా చాలా తక్కువే.

ఇక్కడ 4G ట్రెండ్ ఇప్పుడిప్పుడే మొదలవుతోంటే చైనాలో 530 మిలియన్ల మంది 4G సేవల్ని వాడుతున్నారట.చైనాలో జనాలకి 4G బోర్ కొట్టేసిందట.అందుకే అక్కడ 5G సేవలు మొదలుపెట్టనున్నాయి టెలికాం సంస్థలు.

ఇప్పటికే దాదాపు 100 నగరాల్లో 5G నెట్వర్క్ ట్రయల్స్ ని మొదలుపెట్టింది చైనా.2018 పూర్తయ్యేలోపు టెస్ట్ వర్క్ ని పూర్తి చేసి, 2019 సంవత్సరంలో లోటుపాట్లను సరిచేసుకోని 2020 సంవత్సరంలో 5Gని పూర్తిగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది చైనా.ఈ 5G సేవలు, 4G స్పీడ్ తో పోలిస్తే 20 రేట్లు వేగవంతంగా ఉంటాయట.భారత్ లో ఈ సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో ఇప్పుడే చెప్పలేం.5G సేవలు అందుబాటులోకి రావాలంటే చాలా ఖర్చుపెట్టాలి కంపెనీలు, దానికి ప్రభుత్వ సహకారం చాలా అవసరం.అయితే ముఖేష్ అంబాని 5G సేవల ఆలోచనలో ఉండటం మనం ఆనందించదగ్గ విషయమే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube