మన దేశంలో 5జీ సేవలు ఇప్పుడే ప్రారంభం.. ఆ దేశంలో ఏకంగా 8జీ సేవలు

ప్రస్తుతం టెక్నాలజీ శరవేగంగా మారుతోంది.ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ సేవలు ముందుకొస్తున్నాయి.

 5g Services Have Just Started In Our Country 8g Services In That Country , Sout-TeluguStop.com

ముఖ్యంగా టెలికాం రంగంలో మార్పులు గణనీయంగా చోటు చేసుకుంటున్నాయి.ఒకప్పుడు కేవలం ఫోన్‌ను మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించే వారు.

ప్రస్తుతం సెల్‌ఫోన్లు ఇంటర్నెట్ స్పీడు 0జీ, 1జీ, 2జీ, 3జీ, 4జీ నుంచి ప్రస్తుతం 5జీకి చేరుకుంది.ఇటీవల మన దేశంలోని ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై వంటి నగరాలలో 5జీ సేవలను ప్రధాని మోడీ ప్రారంభించారు.

దీంతో సినిమాలను సైతం 1 సెకనులో డౌన్‌లోడ్ చేసుకునే సౌలభ్యం ఉంది.క్రమంగా ఈ సేవలను దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలిలా ఉన్నాయి.

Telugu India, Korea, Ups, Wireless-Latest News - Telugu

మార్కోని అనే ఒక ఇటాలియన్ ఆవిష్కర్త, 1895లో రేడియో తరంగాలను వైర్‌లెస్‌గా ఉపయోగించి మోర్స్ కోడ్ సిగ్నల్‌లను 3.2 కి.మీ.ల దూరం వరకు ప్రసారం చేశాడు.ఇది సైన్స్ చరిత్రలో మొట్టమొదటి వైర్‌లెస్ ట్రాన్స్‌మిషన్.అప్పటి నుండి, ఇంజనీర్లు మరియు శాస్త్రవేత్తలు RF తరంగాలను ఉపయోగించి కమ్యూనికేట్ చేయడానికి సమర్థవంతమైన మార్గంలో పని చేస్తున్నారు.19వ శతాబ్దం మధ్యలో టెలిఫోన్ ప్రజాదరణ పొందింది.వైర్డు కనెక్షన్, నిరోధిత చలనశీలత కారణంగా, ఇంజనీర్లు వైర్డు కనెక్షన్ అవసరం లేని పరికరాన్ని అభివృద్ధి చేయడం ప్రారంభించారు.రేడియో తరంగాలను ఉపయోగించి వాయిస్‌ని ప్రసారం చేశారు.1970లలో మోటరోలాలో ఇంజనీర్ అయిన మార్టిన్ కూపర్, వైర్‌లెస్‌గా టూ వే కమ్యూనికేషన్ చేయగల హ్యాండ్‌హెల్డ్ పరికరంలో పని చేస్తూ మొదటి తరం మొబైల్ ఫోన్‌ను కనుగొన్నారు.ఇది మొదట కారులో ఉపయోగించడానికి అభివృద్ధి చేయబడింది, మొదటి నమూనా 1974లో పరీక్షించబడింది.ఈ ఆవిష్కరణ వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో ఒక మలుపుగా పరిగణించబడుతుంది, ఇది భవిష్యత్తులో అనేక సాంకేతికతలు, ప్రమాణాల పరిణామానికి దారితీసింది.1జీ తొలిసారి 1980 దశకంలో వాడకంలోకి వచ్చింది.రష్యాలో ఎక్కువ కాలం 1జీ సేవలు సుదీర్ఘకాలం 2017 వరకు కొనసాగాయి.1990 దశకం మధ్యలో జీఎస్ఎం, సీడీఎంఏల రూపంలో 2జీ వినియోగంలోకి వచ్చింది.మొబైల్ డేటా, ఎస్ఎంఎస్ సేవలు మెరుగుపడ్డాయి.2000వ సంవత్సరంలో ఇది ఎక్కువగా వాడుకలోకి రాగా 1జీ సేవలు బాగా తగ్గిపోయాయి.జపాన్‌కు చెందిన ఎన్‌టీటీ డొకొమో 2001, అక్టోబర్ 1 నుంచి 3జీ సేవలను వాడుకలోకి తెచ్చింది.వేగవంతమైన డేటా సేవలు, వాయిస్ సేవల్లో నాణ్యత కోసం ఇది అందుబాటులోకి వచ్చింది.2006 సౌత్ కొరియాలో 4జీ సేవలను వాణిజ్య అవసరాల కోసం ప్రవేశపెట్టారు.2021 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 58 శాతాన్ని 4జీ సేవలు ఆక్రమించాయి.ఇక 2019 నుంచి 5జీ సేవలు లాంఛ్ అయ్యాయి. సౌత్ కొరియాలో దాదాపు అన్ని కంపెనీలో 5జీ సేవలు అందిస్తున్నాయి.ఇక 6జీ సేవలు 2030 నాటికి ప్రపంచంలోని అందరికీ అందుబాటులోకి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి.ప్రస్తుతం 6జీ సేవలే లేని వేళ ఓ దేశంలో 7జీ నుంచి 8జీ వరకు వేగంతో నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి.

నార్వే దేశంలో సెకనుకు 11 జీబీ వేగంతో కొన్ని ప్రాంతాల్లో నెట్‌వర్క్ సేవలు నడుస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube