ప్రపంచవ్యాప్తంగా 58 మంది భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ల సత్తా ఇది: తెలుసుకుని తీరాల్సిందే..!!

ఏ దేశంలో ఉన్నా సరే .ఏ రంగమైనా సరే భారతీయులు సత్తా చాటుతున్నారు.

తాజాగా విడుదలైన మరో నివేదికలో భారత సంతతికి చెందిన కార్పోరేట్ ప్రముఖుల సామర్ధ్యం వెలుగు చూసింది.

అమెరికా, కెనడా, సింగపూర్ సహా 11 దేశాల్లో వివిధ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న 58 మంది భారత సంతతి ఎగ్జిక్యూటివ్‌ల బృందం సమిష్టిగా 3.

6 మిలియన్లకు పైగా ఉద్యోగులను, సుమారు 1 ట్రిలియన్ డాలర్ల ఆదాయాన్ని.మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 4 ట్రిలియన్ డాలర్లు కలిగివున్నారని తేలింది.

అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ సంస్థ ఈ వివరాలను వెల్లడించింది.భారత సంతతికి చెందిన వ్యాపార నాయకులు గతంలో కంటే ఎక్కువగా కార్పోరేట్ రంగంలో విజయాలను నమోదు చేశారని ఆ సంస్థ వెల్లడించింది.

ఇండియాస్పోరా బిజినెస్ లీడర్స్ లీస్ట్‌ పేరిట విడుదలైన ఈ నివేదిక ప్రకారం.ఈ 58 మంది ఎగ్జిక్యూటివ్స్ తమ పదవీకాలంలో 23 శాతం వార్షిక రాబడిని అందించారు.

భారతీయ ప్రవాసులు వ్యాపార రంగంలో చూపే ప్రభావం చాలా గొప్పదని సిలికాన్ వ్యాలీకి చెందిన ఇండియాస్పోరా వ్యవస్థాపకుడు, పెట్టుబడిదారుడు ఎంఆర్ రంగస్వామి అన్నారు.

వర్చువల్ విలేకరుల సమావేశంలో ఈ జాబితాను విడుదల చేసిన రంగాస్వామి మాట్లాడుతూ.ఈ ఎగ్జిక్యూటివ్‌లంతా 37 ఏళ్ల వయసు నుంచి 74 ఏళ్ల మధ్య వున్నారని, వీరి సగటు వయసు 54 సంవత్సరాలని ఆయన తెలిపారు.

కరోనా మహమ్మారి సమయంలో.ఈ కంపెనీలు మానవతా దృక్పథంతో సహాయ సహకారాలు అందించాయని రంగస్వామి కితాబిచ్చారు.

ఈ లిస్ట్‌లో ఉన్న చాలా మంది ఎగ్జిక్యూటివ్‌లు జాతి సమానత్వం పొందే విషయంలో నల్లజాతి సమాజానికి అండగా నిలబడ్డారని ఆయన తెలిపారు.

భారత సంతతి సీఈవోల జాబితాలో భారత్ నుంచి వలస వచ్చిన వారితో పాటు ఉగాండా, ఇథియోపియా, ఇంగ్లాండ్‌, అమెరికా వంటి దేశాలలో జన్మించిన నిపుణులు ఉన్నారు.

ఈ లిస్ట్‌లో పెప్సికో మాజీ సారథి ఇంద్రా నూయి, దినేశ్ పాలివాల్, రాజ్‌గుప్తా, అజయ్ బంగా, సుందర్ పిచాయ్, రెష్మా తదితరులు ఉన్నారు.

మేము ఆర్భకులం కాదు అర్జునులం .. కేసిఆర్ కు కోమటిరెడ్డి కౌంటర్