కరోనా క్లస్టర్ గా మారిన వసతి గృహాం,ఏకంగా....!

దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్న విషయం తెలిసిందే.అయితే దేశంలోని యూపీ లో కూడా కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

 57 Girls At Government Run Home In Uttara Pradesh Kanpur Test Positive,uttara Pr-TeluguStop.com

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ఉన్న ఒక ప్రభుత్వ బాలికల వసతి గృహం లో కరోనా మహమ్మారి విజృంభించింది.ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 57 మందికి కరోనా పాజిటివ్ రావడం తో ఆ వసతి గృహం కరోనా క్లస్టర్ గా మారిపోయింది.

కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగిన ఆ 57 మంది బాలికలను ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.మిగిలిన బాలికలను, సిబ్బందిని క్వారంటైన్ కు తరలించారు.

అయితే, ఇక్కడ ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది.ఆ వసతి గృహంలో ఎక్కువ మంది కరోనా బారిన పడడం తో బాలికలు అందరికీ టెస్టులు నిర్వహించగా ఆ సమయంలో అందులో ఉండే ఐదుగురు బాలికలు గర్భం దాల్చినట్టు వైద్యులు గుర్తించారు.

ఈ విషయం స్థానిక మీడియా ద్వారా బయటకు రావడంతో ఒక్కసారిగా కలకలం రేగింది.అయితే, వసతి గృహంలో చేరే నాటికే బాలికలు గర్భం ధరించారని, వివిధ జిల్లాల నుంచి శిశు సంక్షేమ కమిటీల ద్వారా వసతి గృహంలో చేరారని, ఫోక్సో చట్టం కింద కేసుల్లో ఈ ఐదుగురు బాలికలు బాధితులుగా ఉన్నారని కాన్పూర్ జిల్లా మేజిస్ట్రేట్ పేర్కొన్నారు.

అయితే ఈ వసతి గృహంలో ఎలా బాలికలకు కరోనా సోకింది అని ఆరా తీయగా వసతి గృహంలోని సిబ్బంది, ఇద్దరు బాలికలతో కలిసి ఇటీవల కాన్పూర్ ఆసుపత్రికి వెళ్లారని, అయితే అక్కడ కోవిడ్ రోగులతో కాంటాక్ట్ కావడంతో వారికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు.మొత్తానికి ఉత్తరప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగిపోతుండడం తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube