వామ్మో.. విమాన చక్రంలో కూర్చొని ఏకంగా 550 కీ. మీ. ప్రయాణించిన ఘనుడు..!

ఇప్పటి వరకూ మనం బస్సులో వేలాడుతూ వెళ్లడం చూసుంటాం.కానీ ఓ వ్యక్తి ఏకంగా 35 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానపు ముందు చక్రాల క్యాబిన్ మధ్యలో కూర్చుని ప్రయాణం చేసాడు, అదీ ఒక్కటి కాదు.

 550 Km Sitting On The Wheel Of The Plane. Yours. The Traveling Man,  Flight Jour-TeluguStop.com

రెండు కాదు.ఏకంగా 11 గంటలు.

ఈ ఘటన నెథర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది.

అధికారులు తెలిపిన సమాచారం మేరకు.

సౌత్ ఆఫ్రికా జోహన్నెస్‌బర్గ్ నుంచి నెథర్లాండ్స్ లోని ఆమ్‌స్టర్‌డామ్ షిపోల్ ఎయిర్ పోర్ట్ కి.ఇటలీకి చెందిన కార్గో విమానం బయలుదేరింది.ఆ విమానం మధ్యలో కెన్యాలోని నైరోబీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయింది.దాదాపు 11 గంటల ప్రయాణం తర్వాత ఆ విమానం ఆమ్‌స్టర్‌డామ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది.

విమానం ల్యాండ్ అయిన తర్వాత.విమానపు ముందు టైర్ మధ్యలో ఒక వ్యక్తి ఉన్నట్లు గుర్తించి.

అధికారులకు సమాచారం అందించారు ఎయిర్ పోర్ట్ సిబ్బంది.అతను ప్రాణాలతోనే ఉన్నాడని నిర్థారించిన అధికారులు వెంటనే హాస్పిటల్ కు తరలించారు.

కాగా., అధికారులు ఈ ఘటనపై మాట్లాడుతూ.

ఇలాంటి ప్రయాణం చేసిన వారు ప్రాణాలతో బయటపడిన దాఖలాలు లేవని తెలిపారు.బహుశా అతను నైరోబీలో విమానం ఎక్కి ఉండొచ్చని భావించిన అధికారులు.

అతను నెథర్లాండ్ కు వచ్చేందుకు అన్నిరకాల అనుమతులు ముందే తీసుకున్నట్లు గుర్తించారు.అయితే, అంత ఎత్తులో.

అది కూడా గాలి కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎలా ప్రాణాలు నిలుపుకోగలిగాడనే విషయం అధికారులకు అంతుచిక్కడం లేదు.కాగా నైరోబీ నుంచి ఆమ్‌స్టర్‌డామ్ కు వెళ్ళడానికి రోజుకు ఒకే ఒక కార్గో విమాన సర్వీస్ అందుబాటులో ఉంటుందని.

అలాంటి విమానంలోకి ఆ వ్యక్తి ఎలా వచ్చాడనే విషయంపై ఎయిర్ పోర్టుల అధికారులు ఆరా తీస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube