అమెరికాలో 52 మంది భారతీయుల అరెస్ట్ ..

అమెరికాలో కి అక్రమంగా చొరబడ్డారు అంటూ ఇమ్మిగ్రేషన్ అధికారులు ఎంతో మందిని అరెస్టులు చేస్తున్న విషయం అమ్దరికియా విధితమే.అయితే ఈ అరెస్ట్ అయిన వారిలో 52 మంది భారతీయులు ఉన్నరనియా తెలుస్తోంది.

 52 Indians Arrestedin Us For Illegal Immigration-TeluguStop.com

అయితే వారిలో ఎక్కువగా వాళ్లలో ఎక్కువ మంది సిక్కులు ఉన్నట్లు సమాచారం.మెక్సికో సరిహద్దు నుంచి అమెరికాలోకి అక్రమంగా చొరబడిన వీరు ఒరెగాన్‌ రాష్ట్రంలో ఆశ్రయం పొందడానికి ప్రయత్నిస్తుండగా అదుపులోకి తీసుకొని ఫెడరల్‌ నిర్బంధ కేంద్రంలో ఉంచారు.

అయితే భారతీయులు నిర్భందంలో ఉన్నారన్న విషయం ముందుగా తెలియలేదు అయితే నిర్బంధ కేంద్ర సందర్శనానికి శనివారం వెళ్లిన చట్టసభ్యులు ఈ విషయాన్ని తెలిపారు.వీరితో కలిపి మొత్తం అక్కడ 123 మంది బందీలుగా ఉన్నట్లు వారు తెలిపారు…మిగిలిన వారంతా చైనా, మెక్సికో, నేపాల్‌, పాకిస్థాన్‌, ఉక్రెయిన్‌ తదితర దేశీయులని…అయితే వీరంతా తమ కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చారా అనేది తెలియరాలేదు.రోజులో 22 గంటలు ఒక చిన్న గదిలో ముగ్గురిని ఉంచుతున్నారని.వారి పరిస్థితి నరకంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.

అయితే దేశంలో అక్రమ వలసలు నియంత్రన విషయంలో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాల వారిని కూడా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.ఆఖరికి ట్రంప్ భార్య సైతం ఈ విధానం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్యడం గమనార్హం…అయితే 52 భారతీయుల అరెస్టుల పట్ల స్వదేశంలో ఉంటున్న భారతీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు…అరెస్టు కాబడిన వారి పేర్లు వెల్లడించమని ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube