గుడ్ న్యూస్: భారత్ లో ఈ సంవత్సరం చివరి నాటికి కొత్తగా 50,000 కొలువులు...!

కరోనా వైరస్ కారణంగా ప్రపంచంలో అనేక రంగాలలో పురోగతి పూర్తిగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే.ఇందులో భాగంగా అనేక కంపెనీలు ఉద్యోగుల జీతాలు చెల్లించలేక, పరిశ్రమ నడపడానికి కూడా కష్టమైన సమయంలో వాటిని మూసివేయడం తప్ప వేరే మార్గం లేక వారి కంపెనీలోని ఉద్యోగులను తీసివేసి కంపెనీని మూసివేస్తున్నారు అనేకమంది యజమానులు.

 50000 Jobs In Smart Phone Industry,  Smart Phone Industry, India, Corona Effect,-TeluguStop.com

ఇక మరికొన్ని సంస్థలు అయితే ఉద్యోగుల జీతాలలో కోత విధించాయి కూడా.ఇక మన భారతదేశంలో కూడా అనేక మంది వారి ఉద్యోగాలను కోల్పోయి రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది.

అయితే భారతదేశంలో మాత్రం స్మార్ట్ ఫోన్ రంగంలో ఈ సంవత్సరం చివరి నాటికి 50 వేల కొత్త ఉద్యోగాలు రాబోతున్నట్లు సమాచారం.ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌ ఫోన్ ఇండస్ట్రీకి పెద్దపీట వేయబోతున్నది.

అయితే ఇప్పటికే సాంసంగ్, లావా మరో మూడు కంపెనీల తయారీ పక్రియ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్‌ లో భాగంగా కొత్తగా స్మార్ట్ ‌ఫోన్ తయారీ యూనిట్లను, దేశంలో ఏర్పాటు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం.ఇందుకు సంబంధించి ముందు ముందు మరికొద్ది యూనిట్లలో కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి.

Telugu Scale, Inked Incentive-

నాలుగు నెలల క్రితం భారతదేశం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దేశంలో లార్జ్ స్కేల్ ఎలక్ట్రానిక్స్ సంస్థల వారిని మరింతగా ప్రోత్సహించేందుకు స్కీం లను ఏర్పాటు చేసింది.ఇక స్మార్ట్ ఫోన్ రంగంలో ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ ప్యాకింగ్ మార్కెటింగ్ టెస్టింగ్ మార్కెటింగ్ లాంటి వివిధ ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.ఇక గత 5 సంవత్సరాలలో భారత దేశంలో మొబైల్ ఫోన్ తయారీ ఇండస్ట్రీలో ఏకంగా 100 శాతం అభివృద్ధి కనిపించిందని, అలాగే భారతదేశ పరిశ్రమ నుండి మొబైల్ ఎగుమతులు కూడామొదలయ్యాయని సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ తెలియజేసింది.ఇక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీం ద్వారా కొత్త ఫ్యాక్టరీ లు రేపాటు పూర్తి అయితే ఏకంగా 50 వేల వరకు ఉద్యోగాలను పొందవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube