గూటిలో చిలుక ఎగిరిపోయింది.. పట్టుకొని వస్తే రూ.50 వేలు నజరానా మీదే!

వినడానికి వింతగా వున్నా, ఇది నిజమే.తాము ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న 2 చిలకల్లో ఒకటి కనిపించకుండా పోవడంతో ఓ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది.

 50k Reward For Those Who Found Missing Parrot In Karnataka Tumukuru Details, Par-TeluguStop.com

కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ఎంతో ప్రేమగా పెంచుకున్న చిలక కోసం ఆ కుటుంబం రాత్రి పగలు అని తేడాలేకుండా వెతుకుతోంది.అయినా వారికీ దాని ఆచూకీ లభించలేదు.ఈ నేపథ్యంలో ఆచూకీ చెప్పినవారికి రూ.50,000 నజరానా ఇస్తామంటూ పోస్టర్లు వేశారు.ఈ ఆసక్తికర ఘటన కర్ణాటకలోని తుముకూరులో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే.

తుమకూరులోని జయనగర్ లో నివాసం ఉంటున్న కుటుంబం గత రెండున్నరేళ్లుగా 2 ఆఫ్రికన్ చిలుకలు పెంచుకుంటుంది.వాటిని అచ్చం తమ ఇంటి సభ్యులుగానే భావించేవారు.

ఏటా వాటి పుట్టిన రోజు వేడుకలను కూడా ఘనంగా నిర్వహించేవారట.అయితే తాజాగా ‘రుస్తుం’ అనే చిలుక జూలై 16 నుంచి కనబడకపోవడంతో దానికోసం వెతుకుతూ నగరమంతటా పోస్టర్లు అతికించారు.ఆ పోస్టర్లలో వున్న మేటర్ చూస్తే అవాక్కవలసిందే.“ఆ చిలుక లేకుండా మేము ఉండలేము.అది మా కుటుంబంలో ఒక మనిషి.మీ బాల్కనీల్లో, కిటికీల వద్ద కనబడితే గుర్తించి మాకు చెప్పి సహాయం చేయండి.ఆచూకీ చెప్పినవారికి మేం రూ.50,000 అందజేస్తాం!” అని ఆ చిలుకను పెంచుకున్న కుటుంబ సభ్యులు పల్లవి, అర్జున్ తెలిపారు.

Telugu Reward, Thousand, Parrot, Karnataka, Parrot Rustum, Tumukuru, Latest-Late

ఈమధ్య ఇలాంటి విచిత్రమైన ఘటనే తమిళనాడులో జరిగింది.పెన్ను పోయిందంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది.అయితే అది కూడా ఎవరో చిన్నా, చితకా మనుషులు కాదు… ఓ MP ఫిర్యాదు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తమిళనాడులోని కన్యాకుమారి కాంగ్రెస్ ఎంపీ తన పెన్ను పోయింది పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు.

కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ విజయ్ వసంతన్ పెన్ను పోయింది.దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు.

అది మౌంట్ బ్లాంక్ ఫౌంటెన్ పెన్ అని.దాని విలువ దాదాపు లక్షా 50 వేల రూపాయలు అని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube