ఏపీలో ఐటీ దాడులు.. 5OO కోట్లు ... మూడు హెలికాఫ్టర్లు : ఏంటిది..?   ఏపీలో ఐటీ దాడులు.. 5OO కోట్లు … మూడు హెలికాఫ్టర్లు : ఏంటిది..?     2018-10-13   13:01:21  IST  Sai M

గత కొద్ది రోజులుగా ఏపీలో ఐటీ . ఈడీ శాఖ అధికారులు టీడీపీ బడా నాయకులే లక్ష్యంగా వారి ఆస్తిపాస్తులపై దాడులకు దిగుతున్నారు. ఆదాయ వ్యాలపై లెక్కలు అడుగుతున్నారు. కీలక పత్రాలు తమ వెంట తీసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ భారీ డైలాగులు చెప్తోంది. ఈ దాడుల వెనుక కేంద్రం ఉందని, టీడీపీని దెబ్బకొట్టడానికే ఇలా భయబ్రాంతులకు గురిచేస్తున్నారని.. ఆ పార్టీ నాయకులూ విమర్శలకు దిగుతున్నారు. మరో ముందడుగు వేసి ఈ పాపంలో వైఎస్సార్ కాంగ్రెస్, జనసేన కూడా ఉన్నాయని ఈ రెండు పార్టీలు బీజేపీతో కుమ్మక్కయ్యి ఈ దాడులు చేయిస్తున్నారంటూ తెగ బాదపడిపోతున్నారు. అయితే అసలు విషయం మాత్రం వేరే ఉందనే విషయం ఇప్పుడు బయటకి వచ్చింది.

ఐటీ దాడులు చేసి ఏమి చేశారు .. మీకు ఏ ఆధారాలు దొరకవు అంటూ హేళనగా టీడీపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే… ఐటీ, ఈడీ అధికారులు ఎవరూ వీటి గురించి నోరు విప్పడంలేదు. అసలు ఈ ఐటీ దాడులకు కారణం తెలంగాణ ఎన్నికలే అని తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ మహాకూటమిలో చేరకూడదని టీఆర్ఎస్ భావించింది. దాని కోసం. కొన్ని మీడియా సంస్థల ఆర్టికల్స్ ద్వారా ఒత్తిడి తెచ్చింది. హెచ్చరికలు చేసింది. టీడీపీ అసలు తెలంగాణలో లేనే లేదని తేల్చింది. ఎంత ఒత్తిడి వచ్చినా చంద్రబాబు.. మహాకూటమిలో భాగమయ్యారు. చంద్రబాబు. కాంగ్రెస్‌కు మూడు హెలికాఫ్టర్లు, రూ. 500 కోట్లు సమకూర్చుతారని హామీ ఇచ్చారని టీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.

500cr And 3 Helicopters Found At IT Raids In Andhra Pradesh-

కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం వద్ద నిధులు లేవు కాబట్టి తెలంగాణలో పార్టీకి ఆర్థికంగా సహకరించే పరిస్థితి లేదు కాబట్టి ఆర్ధికంగా చంద్రబాబే ఆదుకోవాలని కేసీఆర్ ఊహించారు. అందుకే.. ఆ నిధులు రాకుండా కట్టడి చేయాలని.. కేంద్రంలో ఉన్న బీజేపీతో ఉన్న సఖ్యతను ఉపయోగించుకుని ఈ ప్రయత్నాలు ప్రారంభించారు. కారణం లేకుండా ఏపీలోని టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేస్తే.. ఇబ్బంది పడతామని.. తెలుసు కాబట్టి.. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసు .. మద్యానికి మించి ఆస్తులు అంటూ హడావుడి చేసి దాన్ని ఏపీ టీడీపీ కి లింకు పెట్టి ఇలా దాడులకు పురమాయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా ఐటీ దాడులతో భయపెడితే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఆర్ధికంగా సహకరించేందుకు టీడీపీ నాయకులు బయపడతారని కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది.