గూగుల్‌‌లో వేధింపులు... మమ్మల్ని రక్షించండి: సుంద‌ర్ పిచాయ్‌కు 500 మంది ఉద్యోగుల లేఖ

ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌లో ఉద్యమంటే యువత ఎగిరి గంతేస్తుంది.ఎందుకంటే అక్కడిచ్చే వేతనం కంటే ఆహ్లాదకరమైన పనివాతావరణం, భిన్నమైన పాలసీలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం వంటి అంశాలు.

 500 Google Employees Write Open Letter To Sundar Pichai Urging Him To Stop Protecting Harassers-TeluguStop.com

గూగుల్‌కు ప్రత్యేకతను తీసుకొచ్చాయి.అందుకే ఇందులో ఉద్యోగానికి అంతటి క్రేజ్ .అయితే ఇదంతా నాణేనికి ఓ వైపు మాత్రమేనని అర్థమవుతోంది.గత కొంతకాలంగా గూగుల్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి.

తాజాగా గూగుల్‌లో వేధింపులు పెరిగిపోతున్నాయ‌ని… త‌మ‌ను ఆదుకుని సుర‌క్షితమైన వాతావర‌ణాన్ని క‌ల్పించాల‌ని ఏకంగా 500 మంది ఉద్యోగులు సంస్థ సీఈఓ సుంద‌ర్ పిచాయ్‌కు బ‌హిరంగ లేఖ రాశారు.న్యూయార్క్ టైమ్స్ ప‌త్రిక‌లో గూగుల్ సంస్థ‌లో జ‌రుగుతున్న వేధింపుల‌పై ఆ సంస్థ‌ మాజీ ఇంజినీర్ ఎమీ నీట్‌ఫీల్డ్ వ్యాసాన్ని ప్రచురించారు.

 500 Google Employees Write Open Letter To Sundar Pichai Urging Him To Stop Protecting Harassers-గూగుల్‌‌లో వేధింపులు… మమ్మల్ని రక్షించండి: సుంద‌ర్ పిచాయ్‌కు 500 మంది ఉద్యోగుల లేఖ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ త‌ర్వాత ఉద్యోగులు ఈ లేఖ రాసిన‌ట్లుగా తెలుస్తున్న‌ది.

గూగుల్ మాజీ ఇంజినీర్ అయిన ఎమి నీట్‌ఫీల్డ్ తాను అక్కడ పనిచేస్తుండగా ఎలా వేధింపుల‌కు గుర‌య్యానో వివరించారు.

ఆమెను కావాల‌నే వేధింపుల‌కు గురిచేసే ఉద్యోగుల ప‌క్క‌నే కూర్చోబెట్టిన‌ట్లు ఆ లేఖ‌లో వివ‌రించారు.దీనిని ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్తే.

కౌన్సెలింగ్ కోర‌వ‌చ్చు, లేదా వర్క్ ఫ్రమ్ హోం చేసుకోవచ్చు అది కూడా కుదరని పక్షంలో సెల‌వుపై వెళ్ల‌వ‌చ్చున‌ని తేల్చి చెప్పారు.వారి వ్యవహారశైలి తనను వేధించేవారికి మ‌ద్ద‌తివ్వ‌డంలాగా క‌నిపించిందని తెలిపారు.

గూగుల్‌లో ప‌నిచేసిన త‌ర్వాత.నేను మ‌ళ్లీ ఉద్యోగాన్ని ప్రేమించ‌ను అనే శీర్షిక‌తో న్యూయార్క్ టైమ్స్ ఒపెడ్ పేజీలో క‌థ‌నాన్ని ప్రచురించింది.

జాత్యాహంకారం, సెక్సిజం గురించి ప్రశ్నించిన పలువురు ఉద్యోగుల‌కు కూడా యాజమాన్యం నుంచి ఇలాంటి స్పంద‌నే వ‌చ్చింద‌ని నీట్‌ఫీల్డ్ రాశారు.

వేధింపులకు గురైన వ్యక్తిని రక్షించడానికి బదులు వేధింపుదారును రక్షించే చరిత్ర గూగుల్‌కు వుందని ఆమె ఆరోపించారు.

ఆండ్రాయిడ్ మొబైల్ సాఫ్ట్‌వేర్ సృష్టికర్త ఆండీ రూబిన్‌కు ఓరల్ సెక్స్ చేయమని బలవంతం చేసినట్లు ఓ మహిళా ఉద్యోగి ఆరోపించడంతో 90 మిలియన్ డాలర్ల ప్యాకేజ్ ఇచ్చి ఆమెను బయటకు పంపేశారు.అలాగే మాజీ సెర్చ్ ఎగ్జిక్యూటివ్ భారత సంతతికి చెందిన అమిత్ సింఘాల్‌కు లైంగిక వేధింపుల విచారణ తర్వాత రాజీనామా చేయవలసి వచ్చినప్పుడు 35 మిలియన్ డాల‌ర్ల ఎగ్జిట్ ప్యాకేజ్ ఇచ్చారు.

2018 లో లైంగిక వేధింపులకు, వేధింపుదారులకు కంపెనీ కొమ్ముకాయడానికి వ్యతిరేకంగా సుమారు 20,000 మందికి పైగా ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయడం టెక్ ప్రపంచంలో కలకలం రేపింది.ఇంత జరుగుతున్నా.

కంపెనీ పనితీరు మాత్రం మారలేద‌ని, గూగుల్ వాకౌట్ డిమాండ్లను ఏవీ తీర్చలేదని ఉద్యోగులు లేఖలో పేర్కొన్నారు.కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉద్యోగులు కంపెనీని కోరారు.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు