50 ఏళ్ల వ్యక్తితో 10ఏళ్ల బాలిక వివాహం.... చివరికి 

50 Years Old Men Try To Marry 10 Years Old Girl In Chittoor

ప్రస్తుత కాలంలో కొందరి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని మరికొందరు వారితో చేయరాని తప్పులు చేయించేందుకు సిద్ధపడుతున్నారు.తాజాగా 50 ఏళ్లు కలిగినటువంటి ఓ వ్యక్తి ముక్కుపచ్చలారని పదేళ్ల మైనర్ బాలికను పెళ్లి చేసుకునేందుకు యత్నించిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది.

 50 Years Old Men Try To Marry 10 Years Old Girl In Chittoor-TeluguStop.com

వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాలోని శ్రీకాళహస్తి మండలంలో ఓ గ్రామంలో 10 సంవత్సరాలు కలిగినటువంటి బాలిక తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తోంది.అయితే అదే గ్రామంలో 50 సంవత్సరాల కలిగినటువంటి ఓ వ్యక్తి నివాసం ఉంటున్నాడు.

అయితే ఈ బాలిక తల్లిదండ్రులకి మాధవాచారి అనే వ్యక్తి డబ్బు ఆశ చూపి 10 ఏళ్ల బాలికను వివాహమాడేందుకు సిద్ధపడ్డాడు.ఇందుకుగాను మాధవాచారి బాలిక తల్లిదండ్రులకు కొంతమేర డబ్బు కూడా ముట్ట జెప్పాడు.

దీంతో బాలిక తల్లిదండ్రులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.ఇది తెలుసుకున్న టువంటి స్థానికులు వెంటనే దగ్గరలో ఉన్నటువంటి పోలీసులకు సమాచారం అందించారు.

Telugu Child, Chittoor, Chittoor Latest-Telugu Crime News(క్రైమ్ వార్తలు)

సమాచారం అందుకున్న టువంటి పోలీసులు బాలిక తల్లిదండ్రులను విచారించి వాస్తవాలు తేల్చారు.దీంతో వెంటనే బాలికను ప్రభుత్వ బాలసద్ భవనానికి తరలించారు.అలాగే ముక్కుపచ్చలారని పది సంవత్సరాలు కలిగినటువంటి బాలికను పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించిన మాధవాచారి ని కూడా అదుపులోకి తీసుకొని విచారణ నిమిత్తం రిమాండ్ కి తరలించారు. 

.

#Chittoor #Chittoor #Chittoor #Chittoor #Child

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube